హోమ్ /వార్తలు /తెలంగాణ /

Congress: కాంగ్రెస్ పార్టీకి ‘మునుగోడు’ టెన్షన్.. రాహుల్ గాంధీపై ప్రభావం ?

Congress: కాంగ్రెస్ పార్టీకి ‘మునుగోడు’ టెన్షన్.. రాహుల్ గాంధీపై ప్రభావం ?

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

TS Politics: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే.. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కూడా తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుపడలేదనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, బీజేపీ తరహాలోనే కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఆ పార్టీ ముఖ్యనేతంతా మునుగోడులో మకాం వేయబోతున్నారు. మునుగోడులో గౌరవప్రదమైన ఫలితాలు సాధించడం ద్వారా తెలంగాణలో తమ పార్టీ ఇంకా బలంగానే ఉందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy) ఇది ఒకరకంగా అగ్నిపరీక్ష లాంటిదే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, ఫలితాలు వచ్చే సమయానికి కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర తెలంగాణలోనే సాగుతుండటం ఆ పార్టీ రాష్ట్ర నేతలను కలవరపెడుతోంది. కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టిన రాహుల్ గాంధీ.. తమిళనాడు, కేరళలో తన పాదయాత్రను ముగించుకుని ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నెలలోనే ఆయన పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది.

  దీపావళి తరువాత తెలంగాణలోకి అడుగుపెడుతున్న రాహుల్ గాంధీ.. కీలకమైన మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక, ఫలితాలు వెలువడేంతవరకు కూడా తెలంగాణలోనే తన పాదయాత్రను కొనసాగించనున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని రకాల పరిణామాలు, దాని పర్యవసానాలు రాహుల్ గాంధీకి తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైతే.. రాహుల్ గాంధీ పాదయాత్రపై ఆ ప్రభావం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

  మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే.. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కూడా తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుపడలేదనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసే పలువురు సీనియర్ నేతలు.. ఫలితాల తరువాత రాష్ట్రంలోనే పాదయాత్ర చేసే రాహుల్ గాంధీని కలిసి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.

  KTR| Munugodu: మునుగోడులో గెలుపు కోసం రూ. 500 కోట్లు ఖర్చు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  Munugode Bypoll: కూసుకుంట్లే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి.. సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన

  రాహుల్ గాంధీ పాదయాత్ర మునుగోడులో లేనప్పటికీ.. ఆ ప్రభావం మునుగోడుపై ఉండేందుకు వీలుగా శంషాబాద్ లేదా ఆ సమీపంలో బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే ఫలితాలు ఏ మాత్రం మెరుగ్గా రాకపోయినా.. రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లాస్ తీసుకోవడం ఖాయమని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోయినా.. ఊరట కలిగించే విధంగా ఫలితాలు సాధించాలని ఆ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Munugodu By Election, Rahul Gandhi, Telangana

  ఉత్తమ కథలు