Home /News /telangana /

TS POLITICS MUNUGODU EX MLA KOMATIREDDY RAJAGOPAL REDDY HAS ASSETS MORE THAN RS 300 CRORES ACCORDING TO HIS AFFIDAVIT AK

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Komatireddy Rajagopal Reddy Assets: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. రాజకీయాల్లోకి రావడానికి ముందు వ్యాపారాలు చేసేవారు. ఆయనకు పలు కన్స్‌ట్రక్షన్ కంపెనీల ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్‌కు తన రాజీనామా లేఖ ఇవ్వడం.. ఆయన దానిని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే చౌటుప్పల్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ద్వారా అమిత్ షా (Amit Shah)సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy).. ఈసారి మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తెలంగాణలో బీజేపీకి మరింత ఊపు వస్తుందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచేందుకు ఉన్న అవకాశాలు మరింతగా పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అందరి దృష్టి నెలకొంది.

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. రాజకీయాల్లోకి రావడానికి ముందు వ్యాపారాలు చేసేవారు. ఆయనకు పలు కన్స్‌ట్రక్షన్ కంపెనీల ఉన్నాయి. అందుకే తెలంగాణలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరిగా చెబుతుంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ప్రకటించిన ఆస్తులు రూ. 300 కోట్లు. 2019 వరకు చేసిన ఆదాయపు పన్ను చెల్లింపులలో అతని ఆస్తులు 371% బాగా పెరిగాయని సూచించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 నుండి 2014 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. 2018లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు.



    ఇక రాజగోపాల్ రెడ్డి ఆస్తుల్లో 5.01 కోట్ల విలువైన నగదు, నగలు, కార్లు ఉన్నాయి. అయన భార్య కె.లక్ష్మి రూ. 261.84 కోట్ల విలువైన సంపదను కలిగి ఉన్నారు. షేర్లలో రూ.10,000 పెట్టుబడిని పెట్టినట్లు ప్రకటించారు. ఆయన భార్య లక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో రూ. 258 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. ఆయన వేసిన అఫిడవిట్ ప్రకారం ఆ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులను చూస్తోంది. రాజ గోపాల్‌ రెడ్డికి 35 లక్షల విలువైన 1,080 గ్రాముల బంగారం, ఆయన భార్య వద్ద రూ.1,38,17,554 విలువైన 3,996 గ్రాముల బంగారం. రూ.6,80,850 విలువైన 20 కిలోల వెండి, రూ.50 లక్షల విలువైన 30 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.

    Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పూర్తిగా సైలెంట్ అయిన ఆ నాయకుడు.. పార్టీకి షాక్ ఇస్తారా ?

    Komatireddy Rajgopal Reddy: ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజీనామా..మునుగోడు అభివృద్ధి కోసమేనని కామెంట్

    ఆయన స్థిరాస్తుల విలువ రూ.19,54,30,850, మరియు 27,91,18,60 ఉన్నాయి. మెదక్, నల్గొండ, రంగారెడ్డిలలో పెద్ద మొత్తంలో భూమిని కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్, సైబర్ స్పాజియోలో పెట్టుబడులు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి, ఆయన భార్య లక్ష్మి ఇద్దరూ వాటాదారులుగా ఉన్న కంపెనీల ద్వారా 26 ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్నాయి. రాజ గోపాల్ రెడ్డి మొత్తం సంపద రూ. 24.55 కోట్లు కాగా, ఆయన భార్య ఆస్తుల విలువ రూ. 289.75 కోట్లు. వీరికి మొత్తంగా రూ. 314.31 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఇటీవల ఆయన కుమారుడి సారథ్యంలోని కంపెనీకి 18 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్ట్ లభించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కారణంగానే ఆయన ఆ పార్టీలోకి వెళ్లారని విపక్షాలు ఆరోపించాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Munugodu By Election

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు