Home /News /telangana /

TS POLITICS MUNUGODU BY ELECTIONS WILL BECOMING NEW CHALLENGE FOR TRS AND KCR IN SELECTING CANDIDATE AK

TRS| Munugodu: టీఆర్ఎస్‌కు ‘మునుగోడు’ తలనొప్పి.. గతంలో లేని విధంగా.. కేసీఆర్‌కు సవాల్

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

Telangana: ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఉప ఎన్నికల్లో పార్టీ గెలవదని హెచ్చరించారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వానికి మునుగోడులో అభ్యర్థి ఎంపిక అంత తేలిక కాదనే చర్చ జరుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడులో గెలుపు అన్ని పార్టీలకు కీలకం. అందులోనూ బీజేపీ కంటే రాజకీయంగా తామే బలంగా ఉన్నామని చాటి చెప్పేందుకు అధికార టీఆర్ఎస్‌కు(Trs) ఈ ఉప ఎన్నిక మరింత కీలకంగా మారింది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ అనేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అయితే అందులో కీలకమైన అభ్యర్థి ఎంపిక విషయం ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తీసుకొచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. మునుగోడులో(Munugodu) ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దానిపై టీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి (kusukuntla prabhakar reddy) మళ్లీ అవకాశం ఇవ్వాలా ? లేక కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ లేక మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు అవకాశం ఇవ్వాలా ? అనే అంశంపై అంతర్గతంగా సర్వేలు చేపడుతోంది.

    అయితే ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావించిందని.. ఇదే విషయాన్ని అక్కడి స్థానిక నేతలకు చెప్పి ఒప్పించాలని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ మునుగోడుకు తిరిగొచ్చిన టీఆర్ఎస్ నేతలు.. చౌటుప్పల్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని మరోసారి తీర్మానం చేశారు.



    ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఉప ఎన్నికల్లో పార్టీ గెలవదని హెచ్చరించారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వానికి మునుగోడులో అభ్యర్థి ఎంపిక అంత తేలిక కాదనే చర్చ జరుగుతోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అధినాయకత్వం డిసైడయితే.. మిగతా నాయకుల మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఇవ్వాలని నిర్ణయించుకుందని.. ఈ అంశంపైనే కసరత్తు చేస్తోందని పార్టీలో టాక్ వినిపిస్తోంది.

    Rakhi festival |Bandi sanjay: రాఖీ పండుగ రోజైనా మహిళలకు ఆ వరం ఇవ్వు.. సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ సూచన

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా?

    అయితే టీఆర్ఎస్ స్థానిక నేతలు మాత్రం ఈ విషయంలో పార్టీ నాయకత్వానికి సహకరించే పరిస్థితులు కనిపించడం లేదని.. ఒకవేళ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయంలోనే దూకుడుగా ముందుకు సాగితే పరిస్థితి ఎలా ఉంటుందో అని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్‌లో ఓ నాయకుడి అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకించే పరిస్థితి ఈ మధ్యకాలంలో కనిపించలేదు. ఈ విషయంలో నిర్ణయాధికారం కేసీఆర్‌కు అప్పగించేవాళ్లు. కానీ మునుగోడు విషయంలో మాత్రం టీఆర్ఎస్‌లో వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana, Trs

    తదుపరి వార్తలు