Home /News /telangana /

TS POLITICS MUNUGODU BY ELECTION HERE IS DETAILS ABOUT TRS CANDIDATE NS

Munugodu TRS Candidate: మునుగోడు టీఆర్ఎస్ బరిలో కొత్త అభ్యర్థి.. రాజగోపాల్ ప్రెస్ మీట్ వెంటనే కేసీఆర్ తో భేటీ.. ఇదిగో ఫొటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

తెలంగాణలో రాజకీయ వేడిని తారా స్థాయికి చేర్చిన మునుగోడు ఉప ఎన్నికలో (Munugodu By Election) గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం ఖరారుకావడంతో.. అయితే, అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda | Hyderabad
  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) మొత్తం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రకటించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు సైమీ ఫైనల్స్ గా మారనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో (Munugodu By Election) గెలిస్తే వచ్చే ఊపుతో రానున్న జనరల్ ఎలక్షన్స్ లో సులువుగా విజయం సాధించి అధికారం చేపట్టవచ్చని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ గెలిచి రాష్ట్రంలో తమకు తిరుగులేదని చాటాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండడంతో ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేయడం ఖాయమే. రాజగోపాల్ రెడ్డి చరిష్మా తమను విజయతీరాలకు చేర్చడం ఖాయమని కమలనాధులు ధీమాగా ఉన్నారు. త్వరలో నియోజకవర్గంలో అమిత్ షాతో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఈ ఎన్నికలు ఆ పార్టీకి అత్యంత సవాల్ గా మారాయని చెప్పవచ్చు.

  సిట్టింగ్ స్థానంలో సత్తా చాటకపోతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ రోజు సభ నిర్వహించారు. అయితే.. ఆ పార్టీ అభ్యర్థిగా ఎవరిని పోటీలో నిలుపుతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు శ్రావంతి లేదా జర్నలిస్ట్ సంఘం నేత పల్లె రవికుమార్ తో పాటు పలువురు బీసీ నేతల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్తు సమాచారం. అయితే.. ఈ రోజు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
  KTR-Munugodu: మునుగోడును టీఆర్ఎస్ లైట్ తీసుకుంటుందా ?.. కేటీఆర్ మాటలకు అర్థమేంటి ?

  తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టికెట్ కోసం పోటీలో ముందు వరుసలో ఉన్నారు. అయితే.. నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సైతం టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన చాలా రోజులుగా నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ప్రకటించిన కొద్ది సేపట్లోనే ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నుంచి కృష్ణారెడ్డికి టికెట్ పై హామీ లభించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కృష్ణారెడ్డికి టికెట్ వస్తే గెలిపించుకుంటాం అంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుండడంతో నియోజకర్గంలో ఈ అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. టీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యలోనే టికెట్ కోసం పోటీ అధికంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం. అయితే.. ఈ టికెట్ పై కేసీఆర్ వ్యూహం ఎలా ఉంది? ఆయన ఎవరికి అవకాశం ఇస్తారు? వీరిద్దరినీ కాదని మరో కొత్త నేతను తెరపైకి తెస్తారా? తదితర అంశాలు తెలాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CM KCR, Komatireddy rajagopal reddy, Munugodu By Election

  తదుపరి వార్తలు