హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఎన్నికలు రెఫరెండం కానున్నాయా?: ఆసక్తిగా తెలంగాణ రాజకీయాలు

Nalgonda: అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఎన్నికలు రెఫరెండం కానున్నాయా?: ఆసక్తిగా తెలంగాణ రాజకీయాలు

నల్గొండ రాజకీయాలు

నల్గొండ రాజకీయాలు

కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్​పై వేటు వేసే యోచనలో ఉందని తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మునుగోడు వ్యవహరం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెపరెండం అయ్యే ఛాన్సు ఉందా? ప్రత్యేక కథనం..

  (Nagaraju, News18, Nalgonda)

  కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Congress MLA Rajagopal Reddy) పార్టీ మార్పుపై క్లారీటీ వచ్చేసింది. బీజేపీలో రాజగోపాల్ చేరిక వాస్తవమేనని స్వయంగా ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. చేరిక తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా సంజయ్ తేల్చిచెప్పారు. అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం... పార్టీలోకి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని ప్రకటించడంతో... తెలంగాణ బీజేపీలోకి (BJP) మరికొంత మంది ఇతర పార్టీ నేతలు కూడా చేరే అవకాశం ఉందంటున్న వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. మొత్తం మీద మునుగోడు వ్యవహరం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) రెఫరండంమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ముఖ్య నేతలతో సమావేశం..

  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) అధిష్టానం రాజగోపాల్ పై చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటీకే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినా... చూసీచూడనట్టు వ్యవహరించగా ఇంకా ఆలస్యమైతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న విషయం గ్రహించి పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఢిల్లీలోని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకముందే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ మార్పుపై రెండో రోజూ నియోజకవర్గం మండల నాయకులతో రాజగోపాల్ రెడ్డి చర్చించారు.

  తాను రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని నాయకులతో రాజగోపాల్ తేగేసి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆయన నేతలకు సూచించారు. తాను పార్టీ మారకపోవడం.. కొంత మందికి ఇష్టం ఉండకపోవచ్చు. అదే విధంగా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని.. తాను రాజీనామా చేస్తే దళితబంధు రాకున్నా కనీసం పింఛన్లయినా వస్తాయని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. లీడర్లు చెబితే జనాలు ఓట్లు వేసే రోజులు పోయాయని.. ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప గెలవలేమని.. కాబట్టి ప్రజల్లోకి వెళ్లి తన రాజీనామా గురించి చర్చించాలని తన అనుచరులకు సూచించారు రాజగోపాల్ రెడ్డి.

  మునుగోడులో కాంగ్రెస్ సభ: రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అలెర్ట్ అయ్యింది. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి ఆధ్వర్యంలో భారీ సభకు సన్నాహాలు చేస్తోంది. నియోజకవర్గానికి కేంద్రమైన చండూర్ లేదా చౌటుపల్‌లో సభ ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు టికెట్ ఆశిస్తున్న నేతలు నియోజకవర్గంలోని నేతలను, కార్యకర్తలను కలుస్తూ అభిప్రాయ సేకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

  నియోజకవర్గంలో వేగం పెంచిన టీఆర్ఎస్: మునుగోడు ఉప ఎన్నిక రావడం తధ్యమని తేలిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ నేతలు అప్రమత్తం అయ్యారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు పార్టీలో చేరికలపై దృష్టిపెట్టారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు పార్టీ కేడర్‌కు దిశానిర్థేశం చేస్తున్నారు. టికెట్ ఆశించే నేతలు ఇప్పటికే సర్వేలతో బిజీబిజీగా గడుపుతున్నారు. పోటిచేసే విషయంపై త్వరలోనే అధిష్టానానికి నివేదిక ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మరో ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు రానుండగా.. ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక అన్ని పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయని విశ్లేషకుల మాట.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Komatireddy rajagopal reddy, Local News, Nalgonda, Telangana Politics, TS Congress

  ఉత్తమ కథలు