హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: ఎంపీ,మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి.. ఏ జిల్లాలోనో తెలుసా..?

Telangana Politics: ఎంపీ,మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి.. ఏ జిల్లాలోనో తెలుసా..?

karimnagar politics

karimnagar politics

Telangana politics: అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే శాసన సభకు పోటీ చేసేందుకు సిట్టంగ్ ఎంపీతో పాటు మాజీ ఎంపీతో పాటు మరి కొందరు సీనియర్ నేతలు ఆలోచిస్తున్నట్లు కరీంనగర్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్నీ పార్టీలు అదే విధంగా ఆలోచిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే శాసన సభకు పోటీ చేసేందుకు సిట్టంగ్ ఎంపీతో పాటు మాజీ ఎంపీ మరి కొందరు సీనియర్ నేతలు ఆలోచిస్తున్నట్లు కరీంనగర్ (Karimnagar)రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్(Congress)పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు టీ. జీవన్‌రెడ్డి(Jeevan Reddy)రెండ్రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. నిజామాబాద్ (Nizamabad)పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం విషయంలో అధిష్టానందే తుది నిర్ణయమని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారు. తనకు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందన్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల (Jagityal) జిల్లా కేంద్రంలోని రెండ్రోజుల క్రితం తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన జీవన్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై పోటీ విషయంలో అధిష్ఠానందే తుది నిర్ణయ మని.. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం అసెంబ్లీకి పోటీ చేస్తా అని తన మనసులో మాటబయటపెట్టేశారు.

Crime News: లాఠీ లాఠీ సినిమా స్టైల్లో మద్యం సీసాలు పగలగొట్టి నోట్లో పొడిచారు .. అతడ్ని ఎందుకు హతమార్చారంటే ..?

ఎంపీ ఒద్దు అసెంబ్లీ ముద్దు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఈసారి కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేయాలనుకుంటున్నారా? అందులో భాగంగానే కరీంనగర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారా?... అంటే అవున నే చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ఉన్న బీజేపీ వర్గాలకు బండి సంజయ్ ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బండి సంజయ్ వేములవాడ నుండి పోటీ చేస్తారని కొందరు... సిరిసిల్ల నుండి పోటీ చేస్తారని ఇంకొందరు, హు స్నాబాద్ నుండి చేసే అవకాశాలున్నా యనే వార్తలు మీడియాలో వచ్చాయి. బైంసా నుండి పాదయాత్ర చేసిన సమ యంలో బండి సంజయ్ ఈసారి ముధోల్ నుండి పోటీ చేయబోతున్నారనే అం శంపై ఆ జిల్లా అంతటా చర్చ జరిగింది. మీడియాలోనూ ఈ వార్తలు రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యం లో బీజేపీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, బలమైన అభ్యర్ధులెవరనే అంశాలపై సర్వే చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మంత్రికి చెక్‌ పెట్టాలంటే ..

కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ను ఢీ కొట్టాలంటే బండి సంజయ్ ను పోటీలో దింపడమే సరైన ఛాయిస్ అని సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమా నులంతా కరీంనగర్ అసెంబ్లీ నుండే ఈసారి పోటీ చేయాలంటూ తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నారు. నేరుగా సంజయ్ ను కలిసి తమ మనోభావాలను వెల్లడిస్తున్నారు.అదే ఆలోచనలో పొన్నం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడ ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీ బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలసింది.పొన్నం ప్రభాకర్ 2009లో కరీంనగర్ పార్లమెం టు నుంచి విజయం సాధించారు. 2004 లో అసెంబ్లీకి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీకి ముందస్తు వస్తే కరీంనగర్ లేదా హుజురాబాద్, వేములవాడ, హుస్నా బాద్ అసెంబ్లీలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చనే చర్చ జరుగుతుంది. హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ రెడ్డి ఆసక్తి చూపకుంటే అక్కడి నుంచి లేదా హుజు రాబాద్, వేములవాడలో ఎక్కడి నుంచై నా పోటీ చేయవచ్చు. కరీంనగర్లో పరిస్థితులు అనుకూలమనిపస్తే బరిలో దిగవచ్చు.

పోటా పోటీగా అసెంబ్లీకి..

మొత్తానికి సీనియర్ల కన్ను ముందస్తు వస్తే అసెంబ్లీ పై పడింది.ఇక మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక చైర్మన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా ఈసారి తనుకూడా శాసన సభకు పోటీ చేయాలానే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వేములవాడ చేన్నమనేని రమేష్ బాబుకు ఈసారి ఎన్నికలో టికెట్ కష్టం అంటూ ఇప్పటికే రాజకీయ సమాచారం చెక్కర్లు కొడుతున్నవి. ఆ స్థానం నుండి వినోద్ కుమార్ బరిలో నిలిచే అవకాశం లేకపోలేదు.కాబట్టి తను కూడా శాసన సభకు పోటీచేసే అవకాశం ఉంది.

First published:

Tags: Karimnagar, Telangana Politics

ఉత్తమ కథలు