Home /News /telangana /

TS POLITICS MP KOMATIREDDY VENKATREDDY NOT SATISFIED WITH THE APOLOGY OF TPCC CHIEF REVANTH REDDY AND MADE ANOTHER DEMAND PRV

Revanth reddy | Komati reddy: రేవంత్​ రెడ్డి క్షమాపణలకూ కరగని కోమటిరెడ్డి.. మరో మెలిక పెట్టిన ఎంపీ

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గానూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. మునుగోడులో (Munugodu) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మొదలైన వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది.  మునుగోడు ఉప ఎన్నికపై ఆయా పార్టీలు ఫోకస్ పెడుతుంటే కాంగ్రెస్​ మాత్రం సొంత కుంపటిలో తగాదాలపై ఫోకస్​ పెట్టింది. ఎందుకుంటే కాంగ్రెస్​లో సొంతగూటిలోనే నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుంటున్నారు. ఇక  టీపీసీసీ చీఫ్‌ విషయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (MP Komatireddy VenkatReddy) పట్టువీడటం లేదు. అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రేవంత్‌రెడ్డి (Revanth reddy) తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యాలకు బాధ్యత వహిస్తూ తాజాగా రేవంత్‌రెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు.

    దీంతో ఈ వివాదం కాసింత చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. మునుగోడులో (Munugodu) నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అద్దంకి దయాకర్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పుడే మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.



    అంతకుముందు రేవంత్​ సోషల్​ మీడియాలో వీడియో సందేశం పెట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy VenkatReddy) అంటే తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ (Telangana) సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌ (Addhanki dayakar)పై చర్యలు ఉంటాయన్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ విషయాన్ని క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డికి తెలియజేస్తానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక, ఈ రోజు నుంచి మునుగోడులో కాంగ్రెస్ (Congress) పాదయాత్ర చేపట్టనుంది. ఇందుకు కొన్ని గంటల ముందు వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం.

    రంగంలోకి అద్దంకి దయాకర్​..

    పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతున్నట్టుగా రేవంత్​ తెలిపారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టువీడటం లేదు. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ (Addhanki Dhayakar) స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి క్షమాపణ చెబుతున్నట్టుగా తెలిపారు. భవిష్యత్తులో మరోసారి అలా జరగనివ్వనని చెప్పారు. పార్టీకి నష్టం జరగకూడదని మరోసారి క్షమాపణ చెబుతున్నట్టుగా వెల్లడించారు. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిందని.. వాటిపై రాతపూర్వకంగా క్షమాపణ కోరానని చెప్పారు. పార్టీతో కలిసి పనిచేసేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Komatireddy venkat reddy, Munugodu By Election, Revanth Reddy

    తదుపరి వార్తలు