Home /News /telangana /

TS POLITICS MP KOMATIREDDY VENKAT REDDY SAID THAT HE WILL PARTICIPATE ON BEHALF OF CONGRESS ON THIS CONDITION IN MUNUGODU BY ELECTION CAMPAIGN PRV

Komatireddy: ‘‘మునుగోడులో ప్రచారానికొస్తా.. కానీ ఒక కండీషన్​ ’’: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో (Munugody By elections) ప్రచారానికి సిద్దమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ విషయమై ఓ కండీషన్​ పెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడులో (Munugodu) విజయం సాధించేందుకు మిగతా పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ (Congress party). టీఆర్ఎస్ (TRS), బీజేపీలను ఢీ కొట్టి మునుగోడులో విజయం సాధించడం అంత సులువు కాదని కాంగ్రెస్ పార్టీకి తెలియనిది కాదు. అయితే తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారడంతో.. ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆలోచనతో ఉన్న ఆ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్లీ పోటీ చేయబోయేది తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కావడం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం విషయంలో ఆయన చాలాకాలం నుంచి అసంతృప్తిగా ఉండటంతో.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన ఎలాంటి వైఖరి తీసుకుంటారన్న అంశం హాట్​ టాపిక్​గా మారింది. ఈ  నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

    బాధ్యతలు అప్పగించాలని..

    మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో (Munugody By elections) ప్రచారానికి సిద్దమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ విషయమై ఓ కండీషన్​ పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించాలని కోరారు. అలా చేస్తే తాను ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. మునుగోడులో స్టార్ క్యాంపెయినర్ గా తనకు బాధ్యతలు అప్పగిస్తే ప్రచారానికి సిద్దమన్నారని వెంకట్ రెడ్డి చెప్పారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.

    BJP Vijayashanti: తెలంగాణ బీజేపీలో కల్లోలం.. మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

    జిల్లా వ్యాప్తంగా అనుచరగణం..

    తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలే అయినా.. జిల్లా వ్యాప్తంగా వీరికి అనుచరగణం ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ అనుచరగణాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) ప్రత్యేకత. అందుకే టీఆర్ఎస్ హవా బలంగా వీచిన సమయంలోనూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎమ్మెల్సీగా నిలబడి విజయం సాధించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించడం వెనుక ఇది కూడా ఒక కారణం.


    అయితే వీరి అనుచరులు, అభిమానుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతోందనే దానిపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఈ బ్రదర్స్ చెరో పార్టీలో ఉండబోతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించగా.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. దీంతో వీరి అనుచరులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా ? లేక బీజేపీలో చేరతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Komatireddy venkat reddy, Munugodu By Election

    తదుపరి వార్తలు