మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలతో పోరాడి విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో.. ఆయన మునుగోడులో ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ప్రతి గ్రామంలోనూ పర్యటించి కాంగ్రెస్‌కు(Congress) ఓటు వేయాలని అక్కడి ప్రజలను కోరుతున్నారు. అసలే అసమ్మతి, అసంతృప్తితో సతమతమయ్యే కాంగ్రెస్ పార్టీకి.. మునుగోడు విషయంలో స్థానిక ఎంపీ, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మింగుడుపడటం లేదు. తన సోదరుడు మునుగోడు (Munugodu) ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేక.. సొంత పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయలేక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇబ్బందిపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నారు.
అయితే నిత్యం వార్తల్లో నిలుస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ శ్రేణులు డైలమాలో పడిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఏదో ఒకరకంగా మీడియాలో మాత్రం ఉంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు మాత్రం ఆయన చేయకపోవడం గమనార్హం. తాజాగా తనను మంత్రి కేటీఆర్ కోవర్ట్ రెడ్డి అని కామెంట్ చేయడంపై మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి.
కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తనను కోవర్ట్‌గా నిరూపించాలని సవాల్ చేశారు. ఈ అంశంపైనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. తనను మునుగోడు గడ్డ మీదే కొందరు కాంగ్రెస్ నేతలు అవమానించారని.. అలాంటప్పుడు తాను అక్కడికి ఎలా వెళ్లి ప్రచారం చేస్తానని ప్రశ్నించారు. అయితే ఓ టీవీ ఛానల్‌కు డిబేట్లో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాను తన తమ్ముడికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రచారం చేస్తానని అన్నారు. ఒకరకంగా ఆయన రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు.
Munugodu: మునుగోడులో ఎలక్షన్ డిమాండ్ ..హైదరాబాద్‌లో కూడా లేనంత ఇంటి కిరాయి ..
Big Breaking: VRAలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేయకపోయినా.. ఆయన సైలెంట్‌గా ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని చికాకు పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈ కీలక సమయంలో ఆయనను కట్టడి చేయలేక కాంగ్రెస్ పార్టీ తెగ ఇబ్బందిపడుతోంది. ప్రతి చిన్న విషయాలకు కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారని.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పరోక్షంగా తన సోదరుడికి అనుకూలంగా.. కాంగ్రెస పార్టీని ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.