హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu By Elections: కాంగ్రెస్​కు కోమటిరెడ్డి గుడ్​న్యూస్​.. మునుగోడు ప్రచారానికి రాబోతున్న ఎంపీ

Munugodu By Elections: కాంగ్రెస్​కు కోమటిరెడ్డి గుడ్​న్యూస్​.. మునుగోడు ప్రచారానికి రాబోతున్న ఎంపీ

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ( Photo Credit:Twitter)

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ( Photo Credit:Twitter)

మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్​ పార్టీ సీరియస్​గా తీసుకుంది. సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​కు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గుడ్​న్యూస్​ చెప్పారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  తెలంగాణలోని (Telangana) ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలే అయినా.. జిల్లా వ్యాప్తంగా వీరికి అనుచరగణం ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ అనుచరగణాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) ప్రత్యేకత. అందుకే టీఆర్ఎస్ (TRS) హవా బలంగా వీచిన సమయంలోనూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎమ్మెల్సీగా నిలబడి విజయం సాధించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) భువనగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించడం వెనుక ఇది కూడా ఒక కారణం. అయితే రాజగోపాల్​ రెడ్డి బీజేపీలోకి చేరడంతో తెలంగాణ రాజకీయాలు హాట్​హాట్​గా మారాయి. మరికొద్దిరోజుల్లో ఉప ఎన్నిక సైతం రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ తరఫున కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రచారంలో పాల్గొంటారా? లేదా అనేది కార్యకర్తల మదిలో ఉండిపోయింది. దీనికి కోమటిరెడ్డి నేడు చెక్​ పెట్టారు. మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి హామీ ఇచ్చారు.

  కోమటిరెడ్డికి ఇంటికి పాల్వాయి స్రవంతి..

  కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి (Congress candidate Palvai Sravanti) భేటీ అయ్యారు. ఉదయం వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లిన పాల్వాయి స్రవంతిని.. తొలుత కలిసేందుకు వెంకట్ రెడ్డి నిరాకరించారు. దాదాపు గంటసేపు వెయిట్ చేసిన ఆమె.. తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్రవంతికి వెంకట్ రెడ్డి ఫోన్ చేయడంతో మరోసారి ఆమె వెంకట్ రెడ్డి నివాసానికి వచ్చారు. మునుగోడు (Munugodu By elections) ప్రచారానికి రావాలని కోమటిరెడ్డిని కోరింది. ప్రచారానికి వస్తానని స్రవంతికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  కాగా, మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అప్పగించనున్నట్లు టీపీసీసీ చీఫ్​ ప్రకటించిన మరుసటి రోజే ఈ కోమటిరెడ్డి ఈ  ప్రకటన చేయడంతో కాంగ్రెస్​లో ఉత్సాహం నెలకొంది. అయితే ఈ ప్రచారంలో కోమటిరెడ్డి మద్దతు ఎంత వరకు ఉపయోగ పడుతుందనేది తెలియాల్సి ఉంది.

  అయితే మునుగోడు కాంగ్రెస్‌పై కొంతకాలం నుంచి పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఎక్కువగా కోమటిరెడ్డి బ్రదర్స్.. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అక్కడ ఏ రకంగా పుంజుకుంటుంది ? పుంజుకున్నా ఉప ఎన్నికలకు సిద్ధమయ్యే స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీని టీపీసీసీ సిద్ధం చేస్తుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Komatireddy venkat reddy, Munugodu By Election, TS Congress

  ఉత్తమ కథలు