Home /News /telangana /

TS POLITICS MP KOMATIREDDY VENKAT REDDY CREATING CONFUSION AMONG TELANGANA CONGRESS WHICH DECIDED TO FIGHT TOUGH IN MUNUGODU BY ELECTIONS OF TELANGANA AK

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ను డైలమాలో పడేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ప్రతీకాత్మక చిత్రం)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ప్రతీకాత్మక చిత్రం)

Komatireddy Venkat Reddy: మునుగోడు కాంగ్రెస్‌పై కొంతకాలం నుంచి పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఎక్కువగా కోమటిరెడ్డి బ్రదర్స్.. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఆయన బీజేపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. మరోవైపు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్ కంటే ముందుగానే సమరభేరి మోగించి మునుగోడులో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మునుగోడులో (Munugodu) మెరుగైన ఫలితాలు సాధించకపోతే.. తెలంగాణలో తమ పుట్టి పూర్తిగా మునుగుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. ఇక్కడ గట్టిగా పోరాటం చేయాలని భావిస్తోంది. అయితే మునుగోడులో రాజకీయ పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)  సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) నుంచి ఏ రకమైన సహకారం అందుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మునుగోడులో ఇతర కాంగ్రెస్ నేతల తరహాలోనే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డిని విమర్శించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వ్యాఖ్యలను తనదైన శైలిలో తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పని చేస్తారా ? లేదా అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఈ ఉప ఎన్నికకు దూరంగా పెట్టినా.. ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే వాదన కూడా ఉంది.



    అయితే మునుగోడు కాంగ్రెస్‌పై కొంతకాలం నుంచి పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఎక్కువగా కోమటిరెడ్డి బ్రదర్స్.. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అక్కడ ఏ రకంగా పుంజుకుంటుంది ? పుంజుకున్నా ఉప ఎన్నికలకు సిద్ధమయ్యే స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీని టీపీసీసీ సిద్ధం చేస్తుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

    Bandi sanjay: బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు.. టీఆర్​ఎస్​లో 12 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం..?

    TS Politics: తుమ్మల చెప్పిన పిడుగు పడటం అంటే అదేనా ?.. కేసీఆర్ ప్లాన్ మార్చేశారా ?

    అయితే తన సోదరడు పార్టీ మారినా.. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ అవుతారా ? లేక మైనస్‌గా మారతారా ? అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మునుగోడులో ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పోరాటం చేయడం ద్వారా రాజగోపాల్ రెడ్డికి చెక్ చెప్పాలని కాంగ్రెస్ భావించింది. కానీ రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలోసహకరిస్తారా ? అన్నది సందేహంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy venkat reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు