Home /News /telangana /

TS POLITICS MP KOMATI REDDY VENKATREDDY SHOCKED THE TELANGANA CONGRESS BY CHANGING HIS TWITTER ACCOUNT PROFILE PRV

Komatireddy: కాంగ్రెస్​కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి.. ట్విట్టర్​ అకౌంట్​లో మార్పులు.. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

తెలంగాణ కాంగ్రెస్​కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇపుడు ఏకంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు కోమటిరెడ్డి.తమను హోంగార్డులంటూ చేసిన వ్యాఖ్యలను మాత్రం వెంకట్​రెడ్డి సీరియస్​గా తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ కాంగ్రెస్​కు (Congress) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (MP Komati reddy Venkatreddy) ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో మునుగోడు వ్యవహారం హాట్​ టాపిక్​గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేరుసైతం రావడంతో ఆయన ఫైర్​ అయ్యారు. అప్పటినుంచి అలకబూనారు. తనపై వ్యాఖ్యలు చేసినవారంతా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్​ చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డినే (TPCC Chief Revanth reddy) సారీ చెప్పాల్సి వచ్చింది. ఇపుడు ఏకంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు కోమటిరెడ్డి.తమను హోంగార్డులంటూ (Home guard) చేసిన వ్యాఖ్యలను మాత్రం వెంకట్​రెడ్డి సీరియస్​గా తీసుకున్నారు.

    పార్టీలో ఐపీఎస్​లున్నారని.. వాళ్లే పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని.. తాము కేవలం హోంగార్డులమేనని.. తమతో ఏమీ కాదంటూ.. వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఇపుడు కోమటిరెడ్డి.. ఏకంగా ఆయన ట్విటర్‌ (Twitter) ప్రొఫైల్‌లో తాను కాంగ్రెస్‌ హోంగార్డు అంటూ పేర్కొన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీని.. అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్‌ అకౌంట్​లో మార్పులు చేయటం గమనార్హం. తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇరువురూ క్షమాపణలు చెప్పినప్పటికీ కోమటిరెడ్డి ట్విటర్‌ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌కు హోంగార్డు అంటూ మార్పులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. తని నిర్ణయాన్ని మార్చుకుని 3 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు హోంగార్డును అనే పదాన్ని తొలగించారు. దీంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.



    దళిత బంధు రాష్ట్రం మొత్తం ఇవ్వాలి...

    అంతకుముందు మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. ‘‘ దళిత బంధు రాష్ట్రం మొత్తం ఇవ్వాలి. బీసీలకు, ఎస్టీలకు ఇలాంటి స్కీమ్‌ పెట్టాలి. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం వరాలు ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే 10లక్షల మందికి పింఛన్లు ఇస్తామంటున్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా? కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నియోజకవర్గాల్లో మాత్రం 57వేల ఇళ్లు కట్టారు. మునుగోడులో పోడు భూముల సమస్య ఉంది. పరిష్కరించాలని చెప్పినా.. ఇంతవరకు పట్టించుకోలేదు." అని అన్నారు.

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా? 

    ఇక టీపీసీసీ చీఫ్‌ విషయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (MP Komatireddy VenkatReddy) పట్టువీడటం లేదు. అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రేవంత్‌రెడ్డి (Revanth reddy) తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యాలకు బాధ్యత వహిస్తూ తాజాగా రేవంత్‌రెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు.

    దీంతో ఈ వివాదం కాసింత చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. మునుగోడులో (Munugodu) నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అద్దంకి దయాకర్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పుడే మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Komatireddy venkat reddy, Nalgonda, Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు