Home /News /telangana /

TS POLITICS MP KOMATI REDDY VENKAT REDDY ALLEGED THAT SOME LEADERS ARE CONSPIRING TO SEND HIM OUT OF THE CONGRESS PARTY PRV

Congress: నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

శుక్రవారం నాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు మీడియా ఛానళ్లతో  మాట్లాడారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    నల్గొండలోని (Nalgonda) మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సమావేశానికి సంబంధించిన తనకు సమాచారం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati reddy Venkat reddy) అన్నారు . తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే సభకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు బట్టారు. తనను అసభ్యంగా దూషించి  పార్టీ నుండి వెళ్లేలా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని  కోమటిరెడ్డి ఆరోపించడం సంచలనం రేకెత్తించింది. శుక్రవారం నాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు మీడియా ఛానళ్లతో  మాట్లాడారు. తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కల్గించిందన్నారు ఆయన. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. తనను పార్టీ నుండి పంపించి కాంగ్రెస్ (Congress) ను ఖాళీ చేయాలనుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

    చండూరులో నిర్వహించిన సభలో తనను అద్దంకి దయాకర్ దూషిస్తే అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు నవ్వారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పరుష పదజాలం ఉపయోగించిన అద్దంకి దయాకర్ తీరును వేదికపై ఉన్న నేతలు ఎందుకు తప్పు పట్టలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా నాయకులను ప్రశ్నించారు. ఈ సభ జరిగిన తరువాతి రోజు అద్దంకి దయాకర్ కు షోకాజ్ నోటీస్​ అంటూ నాటకం ఆడారని కోమటిరెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్న తనను దూషించడంపై తెలుగు ప్రజలంతా తప్పుబడుతున్నాని ఈ సందర్భంగా ఎంపీ అన్నారు. తనకు భేషరతుగా దయాకర్ క్షమాపణ చెప్పాలన్నారు కోమటిరెడ్డి. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీగా మార్చారని దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమర్ధించారు.



    ప్రజల్లో ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని తాను రాహుల్ గాంధీకి ముందే చెప్పానని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. అంతేకాదు ఆరు మాసాల ముందే అభ్యర్ధులను ఖరారు చేయాలని తాను ప్రకటించిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఏమౌతుందని రేవంత్ రెడ్డి చేసన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు కోమటిరెడ్డి  . మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పకుండా ఇలా చెబితే కాంగ్రెస్ క్యాడర్ మనోస్థైర్యం కోల్పోయే అవకాశం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. యుద్ధం చేయకముందే చేతలు ఎత్తివేస్తే ఎలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

    ‘‘అన్ని విషయాలు సోనియా, రాహుల్‌తో మాట్లాడతా. మాణిక్కం ఠాగూర్‌.. జానారెడ్డి ఇంటికి వెళ్లి.. నా దగ్గరకు ఎందుకు రాలేదు. నాకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఉప ఎన్నిక వస్తుంది కాబట్టే కేసీఆర్‌ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు’’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Komatireddy venkat reddy, Nalgonda, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు