తెలంగాణలో కాంగ్రెస్ (Telangana congress) పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హస్తానికి హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు విరుచుకుపడుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగా జరిగిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై (Munugodu By elections) కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలు కొనసాగుతుండగానే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati reddy Venkat reddy), కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి (Marri Shashihar reddy)పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయిట్‌మెంట్ కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను సోనియాకు వివరించనున్నారు. అలాగే తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు మీడియాకు వివరించారు.
BJP Vijayashanti: తెలంగాణ బీజేపీలో కల్లోలం.. మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
మర్రి శశిధర్ రెడ్డి (Congress Senior leader Marri Shasidhar Reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ (manikam tagore) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. రేవంత్ సీనియర్లను గోడకేసి కొడతా అని కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం మందలించలేదని అన్నారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరికాదని కామెంట్ చేశారు.
మునుగోడులో (Munugodu) విజయం సాధించేందుకు మిగతా పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ (Congress party). టీఆర్ఎస్ (TRS), బీజేపీలను ఢీ కొట్టి మునుగోడులో విజయం సాధించడం అంత సులువు కాదని కాంగ్రెస్ పార్టీకి తెలియనిది కాదు. అయితే తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారడంతో.. ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆలోచనతో ఉన్న ఆ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్లీ పోటీ చేయబోయేది తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కావడం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం విషయంలో ఆయన చాలాకాలం నుంచి అసంతృప్తిగా ఉండటంతో.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన ఎలాంటి వైఖరి తీసుకుంటారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో (Munugody By elections) ప్రచారానికి సిద్దమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ విషయమై ఓ కండీషన్ పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించాలని కోరారు. అలా చేస్తే తాను ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. మునుగోడులో స్టార్ క్యాంపెయినర్ గా తనకు బాధ్యతలు అప్పగిస్తే ప్రచారానికి సిద్దమన్నారని వెంకట్ రెడ్డి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.