హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరనున్న కీలక నేత.. ఏర్పాట్లు పూర్తి..

CM KCR: నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరనున్న కీలక నేత.. ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

CM KCR: మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు నేడు(సోమవారం) టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యా హ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకోనున్నారు.

ఇంకా చదవండి ...

  మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు నేడు(సోమవారం) టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యా హ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకోనున్నారు. మోత్కుపల్లి తెరాసలో చేరే ప్రయత్నాలు గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దళితబంధుపై ముఖ్యమంత్రి నిర్వహించిన సన్నాహక సమావేశాల్లోనూ ఇటీవల ఆయన పాల్గొన్నారు. అప్పట్నుంచే తెరాసలో చేరతారన్న ప్రచారం కొనసాగింది. ఇటీవల శాసనసభలోనూ దళితబంధుపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటే ఉన్నారు.

  TRS Party Meeting: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ముగిసిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..


  కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు మోత్కుపల్లి. ఈ పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని అప్పట్లో అందరూ భావించారు. అందుకు అనుగుణంగా సోమవారం ఆయన తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరగబోయే కార్యక్రమంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకోనున్నారు.

  ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ కు ప్లస్ చేకూరింది.. ఈ సారి జాగ్రత్త పడకపోతే వారు ఓడిపోవడం పక్కా..! ఎందుకంటే..


  మధ్యాహ్నం 12 గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి మోత్కుపల్లి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి.. అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకొని.. సీఎం సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరునున్నారు మోత్కుపల్లి. కొన్ని నెలల క్రితం అతడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగి.. బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ విధివిధానాల నచ్చక రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇక హుజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad by election) పోలింగ్‌ ఈ నెల 30న ఉంది.

  Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


  అయితే ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కాగా హుజూరాబాద్‌ (Huzurabad) నియోజకవర్గంలో లేదంటే నియోజకవర్గానికి సమీప ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ప్రచార సభ ఉండే అవకాశముందని టీఆర్ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే వచ్చే నెల 15న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ‘తెలంగాణ విజయ గర్జన’ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సభలు నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్ఎస్ పార్టీ. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న హుస్నాబాద్‌ (Husnabad) లేదా ముల్కనూరులో (Mulkanur) భారీ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభ ద్వారానే పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అంశాలను ప్రస్తావించే అవకాశముందని సమాచారం.

  Published by:Veera Babu
  First published:

  Tags: CM KCR, Motkupalli Narasimhulu

  ఉత్తమ కథలు