హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: చేనేతకు మరింత చేయూత.. త్వరలోనే నిర్ణయం.. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ఎల్.రమణ

Telangana: చేనేతకు మరింత చేయూత.. త్వరలోనే నిర్ణయం.. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ఎల్.రమణ

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఎల్.రమణ

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఎల్.రమణ

Telangana: చేనేత వర్గానికి బీమా పథకాన్ని కూడా అమలు చేయబోతున్నామని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

  తెలంగాణ రాష్ట్రంలో చేనేత వర్గాన్ని ఆదుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే అని మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. చేనేత వర్గాలకు చేయూత అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే ఆ రంగానికి చెందిన పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ సీనియర్ నేత ఎల్.రమణకు ఆయన స్వాగతం పలికారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తాము తీసుకున్న నిర్ణయాల ద్వారా రాష్ట్రం ఎంతో పురోగమిస్తోందని.. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. భూముల అమ్మకం ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలను అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వినియోగిస్తామని తెలిపారు.


  చేనేత వర్గానికి బీమా పథకాన్ని కూడా అమలు చేయబోతున్నామని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చేనేత వర్గానికి చెందిన నాయకులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విషయంలోనూ త్వరలోనే తీపికబురు వింటారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను కలగన్న విధంగా మార్చేవరకు తాను విశ్రమించబోనని వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వ్యక్తి ఎల్.రమణ అని కేసీఆర్ అన్నారు. ఆ వర్గానికి చెందిన వారికి రాజకీయ ప్రాతినిథ్యం పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ క్రమంలో ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, Trs

  ఉత్తమ కథలు