హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLC Kavita: నా మీద సిస్టం అంతా ఎటాక్​ చేస్తోంది.. ప్రశ్నించాలి కదా?: ఎమ్మెల్సీ కవిత

MLC Kavita: నా మీద సిస్టం అంతా ఎటాక్​ చేస్తోంది.. ప్రశ్నించాలి కదా?: ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత

తన మీద సిస్టం అంతా కలిసి ఎటాక్​ చేస్తోందని కవిత అన్నారు. జర్నలిస్టులైనా మిగతావాళ్లు అయినా దానిని ప్రశ్నించాలి కదా అని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) టార్గెట్ కేసీఆర్ అని తాను కాదని టీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత  (MLC Kavita) అన్నారు. సీబీఐ (CBI), ఈడీ (ED)ని జేబు సంస్థగా బీజేపీ (BJP) వాడుకుంటోందని ఆరోపించారు. ఏబీఎన్ రాధాకృష్ణతో జరిగిన ఓ ఇంటర్య్వూలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.  కేసీఆర్ (KCR) అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భయమని.. అందుకే ఇబ్బంది పెడుతున్నారని కవిత ఆరోపించారు. అయితే తన మీద సిస్టం అంతా కలిసి ఎటాక్​ చేస్తోందని కవిత అన్నారు. జర్నలిస్టులైనా మిగతావాళ్లు అయినా దానిని ప్రశ్నించాలి కదా అని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే ఇళ్ల మీదకి వస్తారా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఉందా అని అన్నారు కవిత. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి  వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాలపై మనం ఏం చేయలేకపోవడం ఎంత అన్యాయం అని కవిత అన్నారు. తప్పు తన మీద ఉందని అంటున్నారని తప్పు చేసేది వాళ్లని ఆమె ఆరోపించారు.


  దళిత బంధు (Dalit Bandhu) లాంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతున్నాయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) అన్నారు. ఉచితాలు అనేవి తెలంగాణ ఆర్థిక పరిస్థితి శాసించలేవని అన్నారు. చైనా జీడీపీ.. 1970లో ఇండియాతో సమానంగా ఉండేదని గుర్తు చేశారు కవిత. ఇపుడు చైనా అమెరికా జీడీపీకి (GDP) సమానంగా ఉందని అన్నారు. చైనా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం అక్కడి ప్రభుత్వం అడిగిన వాళ్లకి లోన్​లు ఇచ్చి వ్యాపారరంగానికి ప్రోత్సాహం అందించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.  ఇపుడు తెలంగాణలో అలాంటి పథకమే.. దళిత బంధు అని ఆమె తెలిపారు. దళిత బంధులో ఇచ్చే 10 లక్షలతో చాలా కుటుంబాలు మంచి స్థితిలో ఉన్నాయని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితబంధు ప్రజాప్రయోజన పథకమే అన్నారు కవిత. నోటీసులపై ఆధారాలు లేనిదే ఏం మాట్లాడలేమని, కేసులు పెట్టాలనుకుంటే చేయగలిగిందేమీ లేదని కవిత అన్నారు. ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలపై నమ్మకం పోయిందని, బీజేపీలో ఉంటే ఈడీ, సీబీఐ దాడులు జరగవని కవిత అభిప్రాయపడ్డారు. మునుగోడులో అమిత్ సభ ఫెయిలైందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని కవిత ఆరోపించారు.


  Warangal BJP Meeting: తెలంగాణలో కేసీఆర్​ కుటుంబ పాలనకు విముక్తి కల్పిస్తాం..: వరంగల్​ సభలో జేపీ నడ్డా


  దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందన్నారు కవిత. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్లాన్​ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ప్రతిపక్షాలు ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా వాళ్లు చెబుతున్నారని కవిత వెల్లడించారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పలేదని కవిత అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Kavitha, Telangana Politics

  ఉత్తమ కథలు