Home /News /telangana /

TS POLITICS MLC KAVITHA HAS LASHED OUT AT PRIME MINISTER MODI GOVERNMENT FOR INFLATING CYLINDER PRICES AND IMPOSING BURDENS ON THE PEOPLE PRV

Gas cylinder Price: ఎన్నికల తర్వాత ఇలా ధరలు పెంచి ఏం మెసేజ్​ ఇవ్వాలనుకుంటున్నారు.. మోదీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్​

ఎమ్మెల్సీ కవిత (ఫైల్)

ఎమ్మెల్సీ కవిత (ఫైల్)

క‌మ‌ర్షియ‌ల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆదివారం రూ.102.50 పెంచిన నేపథ్యంలో గ్యాస్‌ ధర పెంచడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతున్న ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఇంకా చదవండి ...
    దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు (Gas cylinder price) అమాంతం పెంచడం పట్ల టీఆర్ఎస్ నాయ‌కురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavita) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP government)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని  కవిత ప్రశ్నించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత.

    భరించాల్సిందే పోయి పెంచడమా..?

    కమర్షియల్ సిలిండర్ ధరలు (Commercial cylinder prices) భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై మ‌రింతగా ఆర్థిక భారం పెంచుతుందని అన్నారు. గ్యాస్‌ సిలిండర్, పెట్రోల్‌, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు.  కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు.



    సామాన్య ప్రజల (Common people) ఆవేదనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102 పెంచడం ఎన్నికల తర్వాత అతిపెద్ద ధరల పెంపుగా నిలిచిందని ఆమె తెలిపారు.  ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు (Commodity prices) పెంచుతున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

    Osmania University: ఎన్​ఎస్​యూఐ ఓయూ ముట్టడి.. మహిళా పోలీసుల పట్ల అసభ్య ప్రవర్తన.. జగ్గారెడ్డి అరెస్టు..

    ఇంధ‌న ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెర‌గ‌డం (Hike).. దీని ప్ర‌భావం నిత్యావ‌స‌రాల‌పై ప‌డ‌టంతో సామాన్య ప్ర‌జానీకంపై ఆర్థిక భారం మ‌రింత‌గా పెరిగింది. ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య క‌మ‌ర్షియ‌ల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు (LPG cylinder price) పెర‌గ‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తమవుతోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆదివారం రూ.102.50 పెంచిన నేపథ్యంలో గ్యాస్‌ ధర పెంచడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతున్న ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు (BJP Government) తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gas, Kalvakuntla Kavitha, LPG Cylinder, Praised to mlc kavitha, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు