హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: ‘‘ఆయన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి’’: BJP MLA ఈటల రాజేందర్​

Telangana Politics: ‘‘ఆయన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి’’: BJP MLA ఈటల రాజేందర్​

ఈటల రాజేందర్​ (ఫైల్​)

ఈటల రాజేందర్​ (ఫైల్​)

కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్సేనని అన్నారు. ముఖ్యమంత్రులను లెక్క చేయని అహంకారం ఆ పార్టీది అని విమర్శించారు.

  కాంగ్రెస్ (Congress) పార్టీ అంతరించిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Eetala Rajendar) రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి (Revann reddy) బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని ఆయన విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గెలవదనే నిరాశ, నిస్పృహలతో రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దల అహంకారం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి అని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్సేనని అన్నారు. ముఖ్యమంత్రులను లెక్క చేయని అహంకారం ఆ పార్టీది అని విమర్శించారు. ముఖ్యమంత్రలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

  రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ రాజకీయంగా ఎదిగారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వాడుకుని ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని, తమతో చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. బట్ట కాల్చి మీద వేయడం తగదన్నారు. బ్లాక్ మెయిలింగ్ నుంచి ఈ స్థాయికి వచ్చినట్లుగా రేవంత్ కామెంట్స్ ఉన్నాయని మండిపడ్డారు. ఏదైనా మాట్లాడితే సంస్కారం, సభ్యత ఉండాలన్నారు ఈటల రాజేందర్ .

  రిజల్ట్ రావడం లేదనే నిస్పృహలో..

  పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో సరైన రిజల్ట్ రావడం లేదనే నిస్పృహలో రేవంత్ ఉన్నట్లు కనిపిస్తోందని, పిచ్చి భాష మాట్లాడితే ప్రజల్లో పలుచన అయ్యేది అతనేనని, అంత మొనగాడు అయితే కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేదు..? అని రేవంత్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్.. ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.

  జార్ఖండ్‌లో సోరెన్‌కు టీఆర్ఎస్ డబ్బులు పంపింది..

  దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు ఈటల. ఒక్క రాజస్థాన్ లోనే ఉన్నట్లుందని అన్నారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడని చెప్పారు. బీజేపీ సిద్దాంతం ఉన్న పార్టీ అని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ వచ్చిందన్నారు. కానీ శివసేన అపవిత్ర పొత్తుకు శ్రీకారం చుట్టిందన్నారు. సిద్ధాంతంలో బాల్ థాకరే అందె వేసినవారని చెప్పారు. ప్రజలు ఛీకొడుతుంటే ఉద్ధవ్ థాకరేకు ఏక్‌నాథ్ షిండే ఎదురు తిరిగారని అన్నారు. యూపీలో 403 స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని తిరస్కరిస్తే కేరళకు వెళ్లాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో స్టాలిన్‌కు, జార్ఖండ్‌లో సోరెన్‌కు టీఆర్ఎస్ డబ్బులు పంపిందని ఆరోపించారు. అలాంటప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని  ఈటల  ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోనే రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని చెప్పారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పినా ఆయన టీఆర్ఎస్‌లోకి రాలేదన్నారు. ఆర్థికంగా దెబ్బతీసినా కాంగ్రెస్‌లోనే ఉన్నారని  ఈటల చెప్పారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Etala rajendar, Revanth Reddy

  ఉత్తమ కథలు