తెలంగాణ(Telangana)ప్రజల సెంటిమెంట్‌కి అనుగూణంగా నిర్వహించే వేడుకలు, పూజించే దేవతలు, జరుపుకునే ఉత్సవాల్లో ఎలాంటి లోటు ఉండదు. ఏ పండుగైనా, జాతరైనా, లేక బోనాలైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రజల సౌకర్యార్దం పలు అభివృద్ది పనుల్ని నిర్వహిస్తుంది. ఆషాడమాసంలో మొదలయ్యే బోనాల పండుగ కోసం సికింద్రాబాద్(Secunderabad)ఉజ్జయినీ మహంకాళి టెంపుల్(Mahankali Temple)లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా(Social media)వేదికగా ప్రస్తుతం మహంకాళి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం మారుస్తారనే ప్రచారం జరిగింది. దీన్ని ఖండించారు తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి(Minister) తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav). కేవలం అది తప్పుడు ప్రచారమన్నారు.
అమ్మవారిని అడ్డుపెట్టుకొని రాజకీయాలా..
అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. భక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించే వారి సంగతి అమ్మవారే చూసుకుంటారని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్‌యాదవ్. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్న ఏకైక లక్ష్యంతో ప్రైవేట్ ఆలయాలకు కూడా నిధులు మంజూరు చేస్తూ వాటిని అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు.
ఘనంగా నిర్వహించాలనే ..
కరోనా కారణంగా గత రెండేళ్లు బోనాల ఉత్సవాలు నిర్వహించలేదు. అందుకే ఈసారి మహంకాళి అమ్మవారి జాతరను ఘనంగా నిర్విహంచాలని జాతరకు వచ్చే లక్షలాదిమంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి కల్పించే సౌకర్యాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు మంత్రి.
మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గం. pic.twitter.com/tyISqdwhvO
— Talasani Srinivas Yadav (@YadavTalasani) May 27, 2022
తప్పుడు ప్రచారమే..
ప్రతి ఏడాది ఆషాడమాసంలో మహాంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతాయి. ఈసారి కూడా జూలై 17, 18వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో లక్షలాది మంది పాల్గొంటారని చెప్పారు మంత్రి. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి అబాసుపాలు కావద్దని మంత్రి సూచించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయాలనుకునే వారిని సహించమని వార్నింగ్ ఇచ్చారు తలసాని శ్రీనివాస్‌యాదవ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.