హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS | Viral video : మంత్రి అనుచరుల అత్యుత్సాహం .. కలెక్టర్, ఎస్పీ కళ్ల ముందే సాధారణ వ్యక్తిపై దాడి

TRS | Viral video : మంత్రి అనుచరుల అత్యుత్సాహం .. కలెక్టర్, ఎస్పీ కళ్ల ముందే సాధారణ వ్యక్తిపై దాడి

trs leaders enthusiasm

trs leaders enthusiasm

TRS|Vira l video:రాజకీయ నేతల కంటే వారి పక్కన ఉండే వాళ్లు, అనుచరుల పేరుతో వెంట తిరిగే వాళ్లు .. వాళ్ల మెప్పు కోసం హడావుడి చేసే వాళ్ల చర్యలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అనుచరులు చేసిన పని ఇప్పుడు ఆయనకే తలనొప్పిగా తయారైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

రాజకీయ నేతల కంటే వారి పక్కన ఉండే వాళ్లు, అనుచరుల పేరుతో వెంట తిరిగే వాళ్లు .. వాళ్ల మెప్పు కోసం హడావుడి చేసే వాళ్ల చర్యలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతే కాదు ప్రభుత్వ కార్యక్రమాలైనా, వ్యక్తిగత ప్రోగ్రామ్‌కి వెళ్లినా అక్కడ నేతల కళ్లలో పడేందుకు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రజాప్రతినిధులను ప్రజల్లో మరింత పలచన చేస్తున్నారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌(Srinivas Goud)అనుచరులు చేసిన పని ఇప్పుడు ఆయనకే తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌(TRS) పార్టీకి పెద్ద సమస్యగా మారింది. దసరా రోజున జరిగిన సంఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో, మీడియాలో విస్తృతంగా వైరల్(Viral) అవుతోంది. వీడియో(Video)చూసిన వాళ్లంతా సామాన్యులపై ఏంటీ మీ ప్రతాపం అంటూ మండిపడుతున్నారు.

Telangana : తుపాకులతో రెచ్చిపోతున్న నాయకులు ..

సాధారణ వ్యక్తిపై దాడి..

మహబూబ్‌నగర్‌లో దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలో రావణ దహనం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. వేదికపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు. కింద బాణా సంచా పేల్చుతున్నారు. అయితే మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు, మరికొందరు టీఆర్ఎస్‌ కార్యకర్తలు బాణా సంచా కాల్చే వ్యక్తి దగ్గరకు వచ్చి దుర్భాషలాడారు. మంత్రి ప్రసంగిస్తుంటే బాణా సంచా కాల్చకూడదని తెలియదా అంటూ అతడిపై దాడి చేశారు. కార్యక్రమం జరుగుతూనే ఉంది. సదరు కామన్‌ మెన్‌పై మంత్రి అనుచరులు చెంపలపై కొడుతూ నెట్టి వేస్తూ అవమానకరంగా ప్రవర్తించారు.

అంత అత్యుత్సాహం ఎందుకు..

రావణ దహనం కార్యక్రమం జరుగుతోంది. చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ వేదికపైనే ఉన్నారు. సాధారణ వ్యక్తిని కొడుతుంటే ఆపాల్సింది పోయి ..మంత్రి అనుచరులు దాడి చేస్తుంటే చోద్యం చూస్తుండిపోయారు. దీంతో బాధితుడికి సపోర్ట్‌గా ఎవరూ మాట్లాడలేకపోయారు. అయితే అక్కడే ఉన్న మరికొందరు ఈ దాడి దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో రచ్చ రచ్చ అవుతోంది.

Telangana : BRSలో ఉద్యమాల జిల్లా నేతలకు ప్రాధాన్యత ..నెక్స్ట్ కేసీఆర్‌ పోటీ చేసేది అక్కడి నుంచేనా..!

వీడియో వైరల్ ..

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అనుచరులు చేసిన ఘనకార్యానికి నెట్టింట్లో వీడియో చూసిన కొందరు తుపాకీ శీనన్న దండు అరాచకం..పక్కనే ఖాకీ దుస్తులు వేసుకొని నిలబడ్డ పోలీసుల తమాషా గులాంగిరి అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు టీఆర్ఎస్‌ పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే అధినేత దేశ్‌కి నేతగా ఎదగాలని చూస్తుంటే కింది స్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం తమ ఓవర్‌ యాక్షన్ ప్రదర్శిస్తూ పార్టీకి మరింత ఇబ్బంది తెస్తున్నారని తిట్టుకుంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Mahbubnagar, Srinivas goud, Telangana News

ఉత్తమ కథలు