Home /News /telangana /

TS POLITICS MINISTER SABITA INDRA REDDY REJECTS FORMER TRS MLA THIGALAKRISHNA REDDY CRITICISM SNR

Telangana politics: మంత్రి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు: తీగల..కృష్ణారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు: సబితా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

TRS | Telangana: తెలంగాణ అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రేటర్‌ పరిధిలోని కీలక నేతలుగా ఉన్న తీగల కృష్ణారెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వర్గపోరుతో మంత్రిపై తీగల ఆరోపణలు, విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి ...
తెలంగాణ అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రేటర్‌(Greater)పరిధిలోని కీలక నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వ్యక్తిగత దూషణలతో పాటు ఒకరిపై మరొకరు అక్రమాలు, అవినీతిపై విరుచుకుపడుతున్నారు. బాహాటంగానే బయటపెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో మంత్రి సబితాఇంద్రారెడ్డి(Sabita Indra Reddy),మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి(Thigalakrishna Reddy)మధ్య వార్‌ ముదురుతోంది. ముఖ్యంగా మీర్‌పేట్‌(Meerpet)ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు తీగలకృష్ణారెడ్డి. అంతే కాదు మీర్‌పేట పరిధిలోని కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించిన తీగలకృష్ణారెడ్డి పాఠశాల స్తలాలు, చెరువులను కూడా వదలడం లేదని ఘాటు విమర్శలు చేశారు. మీర్‌పేట్‌ అభివృద్దిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. షడన్‌గా తీగలకృష్ణారెడ్డి ఈస్థాయిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అవినీతి ఆరోపణలు..
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలను ఎక్కుపెట్టడానికి ముందు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మీర్‌పేట్‌లోని మంత్రాల చెరువును పరిశీలించారు. ఆక్కడే ఆయన ఈ ఘాటు విమర్శలు చేశారు. అంతే కాదు తమ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ఎంతకైనా పోరాడతానన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌తో కూడా చర్చిస్తానన్నారు. నిరాహారదీక్ష చేయడానికి కూడా తాను సిద్దేమని చెప్పారు. అంతే కాదు సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలవలేదని..వేరే పార్టీ నుంచి వచ్చిన వచ్చారని...కాని తాను మాత్రం ఎప్పటికి టీఆర్‌ఎస్‌ వాడినే అంటూ చాలా ఆగ్రహంగా మాట్లాడారు తీగలకృష్ణారెడ్డి.



భగ్గుమన్న విభేదాలు..
రాజకీయల్లో వర్గవిభేదాలు సర్వ సాధారణం. కాని ఓ మంత్రి స్థాయి నాయకురాలిపై ఓ మాజీ ఎమ్మెల్యే అది కూడా సొంత పార్టీకి చెందిన నాయకుడే ఈ తరహా విమర్శలు చేయడానికి కారణం ఏమై ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం స్పందించారు. తీగల కృష్ణారెడ్డి ఈలాంటి విమర్శలు, ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతే కాదు తాను కబ్జాలకు, అక్రమాలకు పాల్పడే సీఎం ఊరుకోరు కదా అంటూ తీగల కృష్ణారెడ్డి విమర్శలను తోసిపుచ్చారు.

TS Politics: తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం.. బీజేపీ ప్లాన్ అదేనన్న రేవంత్ రెడ్డి



ఒకే ఒరలో రెండు కత్తులు..
ఇద్దరూ ఒకే పార్టీ నాయకులు అయినప్పటికి గతంలో వేర్వేరు పార్టీల్లో కొనసాగారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీలో ఉంటే ..సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. గత ఎన్నికలు అంటే 2018 ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా తీగల పోటీ చేస్తే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. తీగల సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఒడిపోయారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌ తీర్ధం పుచ్చుకోవడం, మంత్రి పదవి దక్కడంతో తీగలకృష్ణారెడ్డి కొంత అసహనం, అసంతృప్తితో ఉన్నారు. ఆ గ్యాపే నియోజకవర్గంలో కూడా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందని టీఆర్ఎస్‌ వర్గాలే అంటున్నాయి. మరి ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం ఇంతటితో ఆగిపోతుందా లేక ..ఇంకా పెద్దది అవుతుందో చూడాలి.

Peddpalli : పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు .. ఇదెక్కడి పెద్దపంచాయితీ అంటున్న క్యాడర్


Published by:Siva Nanduri
First published:

Tags: Sabitha Indra Reddy, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు