హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Hyderabad : నాపై దాడి రేవంత్‌రెడ్డి కుట్రే .. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana | Hyderabad : నాపై దాడి రేవంత్‌రెడ్డి కుట్రే .. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

(నా హత్యకు కుట్ర పన్నారు)

(నా హత్యకు కుట్ర పన్నారు)

Hyderabad:తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం జరిగిన దాడి రాజకీయంగా కలకలం రేపుతోంది. తన కాన్వాయ్‌పై దాడి చేయించింది టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డేనని ఆరోపణలు చేస్తున్నారు మంత్రి. రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తన హత్యకు కుట్ర పన్నుతున్నారని..ఇలాంటి వాటికి తాను భయపడబోనన్నారు. తన కాన్వాయ్‌పై దాడి చేసిన ఘటనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మంత్రి.

ఇంకా చదవండి ...

తెలంగాణ కార్మికశాఖ మంత్రి(Telangana Labor Minister) సీహెచ్‌.మల్లారెడ్డి (Mallareddy) కాన్వాయ్‌పై ఆదివారం రాత్రి ఘట్‌కేసర్‌లో దాడి జరిగింది. ఈదాడి వెనుక ముమ్మాటికి టీపీసీసీ చీఫ్(TPCC Chief)రేవంత్‌రెడ్డి (Revanth reddy)హస్తముందని ఆరోపించారు మంత్రి. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే తన అనుచరులతో రెడ్డి సింహ గర్జన సభ(Reddy Simha Garjana Sabha)కు వెళ్లిన తనపై దాడి చేయించారని విమర్శించారు. 8ఏళ్లుగా రేవంత్‌రెడ్డి తనను బ్లాక్‌మెయిల్‌Blackmail చేస్తున్నారని..ఇదే విషయాన్ని గతంలో చెప్పిన మంత్రి మల్లారెడ్డి మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్రపన్నుతున్నారని..అయినా తాను భయపడబోనన్నారు మల్లారెడ్డి.

దాడి వెనుక రేవంత్‌ హస్తం ఉంది

ఆదివారం తనపై జరిగిన దాడి ఘటనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆగడాలు సాగనివ్వబోమన్నారు. అతను చేస్తున్న నేరాలను బయటకు లాగుతామని పేర్కొన్నారు. రెడ్డి సామాజికవర్గానికి టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు. మేనిఫెస్టోలో పొందుపర్చిన వాగ్ధానాలను మర్చిపోమని...రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. కరోనా కారణంగా జాప్యం అయిందనే విషయాన్ని సభా వేదికగా చెబుతున్న సమయంలోనే తన ప్రసంగానికి అడ్డుతగలడం, తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయించడం చివరకు తనపై , కాన్వాయ్‌పై దాడి చేసే వరకు వచ్చారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

అక్రమాలను ప్రశ్నిస్తున్నాననే ..

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై దాడికి పాల్పడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. సొంత సామాజికవర్గం నాయకులు ఏర్పాటు చేసిన సభలోనే ఇంతటి అవమానం జరగడంపై అధికార పార్టీకి చెందిన నేతలు ఖండిస్తున్నారు. ఇది ప్రజలో, అక్కడి నాయకులు చేసిన పని కాదని..కేవలం ఆయన వ్యతిరేక శక్తులు పథకం ప్రకారం చేసిన విధ్వంసంగానే చూస్తున్నారు. రెడ్డి సింహగర్జన కార్యక్రమంలో మంత్రి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయని..తనకు నమ్మకం ఉందని మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే గెలుస్తుందని సభా వేదికపై గట్టిగా చెప్పడంతో గందరగోళం నెలకొంది. మొదట్లో ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకించిన నాయకులు..తర్వాత వేదికపైకి చేతికి దొరికి వాటిని విసిరివేశారు.

దాడిపై కౌంటర్ ఇచ్చిన మంత్రి..

మంత్రి ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతుండగా కారును వెంబడించారు. కాన్వాయ్‌పై కుర్చీలు, రాళ్లు, చెప్పులు, వాటర్‌ బాటిల్స్‌ విసిరేశారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న మల్లారెడ్డి గతంలో కూడా చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలైన బీజపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపైన సవాళ్లు విసిరారు. వ్యక్తిగత దూషణలు, అవినీతి ఆరోపణలు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి తనను బ్లాక్‌మెయిల్ చేశాడని..అతని కుమార్తె పెళ్లికి డబ్బులు ఇచ్చింది కూడా తానేనని చెప్పడంతో మల్లారెడ్డి వ్యాఖ్యలు మరింత రాజకీయ అగ్గిని రాజేశాయి.

First published:

Tags: Malla Reddy, Revanth Reddy, Telangana Politics

ఉత్తమ కథలు