ఉపఎన్నికల ప్రచారం మొదలైందో లేదో మునుగోడు(Munugodu)లో అధికార, విపక్షాల మధ్య కిరికిరి రాజకీయాలు మొదలయ్యాయి. ఎప్పుడూ ఏదో విషయంలో విమర్శలు, పరాభవం ఎదుర్కొనే మంత్రి మల్లారెడ్డి(Mallareddy)కి మరొకసారి అలాంటి తలనొప్పి తప్పలేదు. టీఆర్ఎస్(TRS) అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Koosukuntla Prabhakar Reddy)తరపున ప్రచారానికి వెళ్లిన సమయంలో మంత్రి మందు పార్టీలో పాల్గొనడం సంచలనంగా మారింది. మందు పార్టీలో ఉండటమే కాకుండా అక్కడ కూర్చున్న వాళ్లకు తానే స్వయంగా మందు పోస్తున్న వీడియో(Video), ఫోటోలు(Photo)బయటకు రావడంతో బీజేపీ(BJP),కాంగ్రెస్(Congress), నేతలు మంత్రి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మందు పార్టీలు ఇస్తున్నారనే ప్రచారం చేశారు. ఇక మంత్రి మందు పార్టీకి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా చక్కర్లు కొట్టడం, ఆయనపై బీభత్సమైన ట్రోలింగ్(Trolling)జరుగుతోంది.
బంధువుల ఇంటికి వెళ్లినా గంతే..
మునుగోడు ఉపఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా చెబుతున్న టీఆర్ఎస్ అంతే ధీటుగా ప్రచారం చేస్తోంది. అయితే మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం సైదాబాద్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండ్లబావి గ్రామంలో కొంత మంది ఓటర్లతో కలిసి సమావేశమయ్యారు. అక్కడున్న వారిలో కొందరు మంత్రిని మద్యం కావాలని కోరడంతో మంత్రి మల్లారెడ్డి స్వయంగా తన సిబ్బందితో మద్యం తెప్పించారు. ఓటర్లతో కలిసి మంత్రి మందు తాగినట్లు, వాళ్లకు మద్యం పోస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.
మునుగోడులో మద్యాన్ని ఏరులై పారిస్తున్న మంత్రి మల్లారెడ్డి@krg_reddy #Mallareddy #Munugode pic.twitter.com/weTTI7kiWv
— Team Rajanna (@RajannaTeam) October 9, 2022
బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం..
ఎవరో ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంత్రి మందు పార్టీ కాస్తా రేవ్ పార్టీలా మారిపోయింది. ఆయనపై విస్తృతంగా నెగిటివ్ ప్రచారం చేయడంతో పాటు టీఆర్ఎస్ మునుగోడులో గెలిచేందుకు స్వయంగా మంత్రే ఓటర్లకు మందు పోస్తున్నారనే ప్రచారం జరిగింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆత్మీయులను కలవలేదని ..అందుకే గుండ్లబావిలోని తన బావలు, సోదరుల ఇంటికి వెళ్లానని అంగీకరించారు. తన ఫోటోలు, వీడియోలపై జరుగుతున్న ప్రచారాన్ని సమర్ధించుకునేందుకు బంధువుల ఇళ్లలో కూర్చొని మందు తాగితే తప్పేంటన్నారు. మందు పార్టీ ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారం కేవలం బీజేపీ , కాంగ్రెస్ నేతలు చేస్తున్న అసత్యప్రచారమని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.
నేను మందు తాగలే: మల్లారెడ్డి
బంధువులతో కలిసి మద్యం తాగిన విషయాన్ని అంగీకరించిన మంత్రి ఈవిషయంలో తన తప్పేమిలేదంటున్నారు. అనవసరమైన దానికి రాద్ధాంతం చేయడం బీజేపీ, కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయిందని ..ఎవరో తీసిన ఫోటోను పట్టుకొని తనను బదనాం చేయడానికే ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వైరల్ అవుతున్న ఫోటోల్లో తాను తాగలేదని..తన ముందున్న గ్లాస్, ప్లేట్ కాళీగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోమని తాను ఏ విచారణకైనా సిద్ధమేనంటూ మందు పార్టీ ఇచ్చారని జరుగుతున్న ప్రచారంపై మీడియాకు వివరణ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.