కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Congress leader Rahul gandhi)పై తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శలు గుప్పించారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ అని సెటైర్లు (satires) వేశారు. అంతే కాకుండా పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏమీ తెలియదని ఆరోపణలు చేశారు కేటీఆర్. హైదరాబాద్ నగరానికి (Hyderabad water supply) 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించామన్నారు మంత్రి కేటీఆర్ . హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (Nagarjuna sagar) వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ (sunkishala intake well project) పనులకు కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరుసగా ఏడేండ్లు కరువు వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులు భగత్ చేసి చూపిస్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే భగత్ (MLA Bhagath)కోరిక మేరకు నూతన స్టేడియం కోసం రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఓపెన్ డ్రైనేజీ కోసం రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
పదవులు అనుభవించారు తప్ప..
జానారెడ్డి (Janareddy) అంటే గౌరవం.. కానీ వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారే చెప్పాలి. పక్కన కృష్ణా నది ప్రవహిస్తున్నా.. ఫ్లోరైడ్ నిర్మూలన చేయలేదు. రైతులకు సాగు నీరు ఇవ్వని అసమర్థులు గత పాలకులు. ఫ్లోరైడ్ నిర్మూలనకు కేసీఆర్ కృషి చేసి చూపించారు. గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప.. అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. పెద్దమనుషుల ఆత్మగౌరవం పెంచిన నేత కేసీఆర్.. బీడీ కార్మికుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ అని అన్నారు.
రాహుల్‌కు ఏమీ తెలియదు..
ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి (Jana reddy) ఏం చేశారు.? రాహుల్ (rahul)కు ఒక్కసారి అవకాశమిస్తే ఏం అభివృద్ధి చేస్తారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ. పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏమీ తెలియదు. నాగార్జున సాగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దు. యువనాయకుడు భగత్‌ను కాపాడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉంది’’ అని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఆయన రికార్డు సమయం పని చేశారని, కానీ ఆయన ఏం ఉద్ధరించలేదని ధ్వజమెత్తారు. ఆరడుగుల అజానుబాహుడు ఉన్న ఆరు గంటల కరెంట్ రాలేదని విమర్శలు చేశారు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు ప్రేమికులం, రైతు బిడ్డలం అని చెప్పుకున్నారు తప్ప వారిని పట్టించుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుత హైదరాబాద్‌లో నీటి అవసరాలు 37 టీఎంసీలు.. 2072 వరకు ఆలోచిస్తే ఇది మరో 34 టీఎంసీలకు చేరుకుంటుందని మంత్రి అన్నారు. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు మంత్రి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, KTR, Nagarjuna sagar, Nalgonda, Rahul Gandhi, Trs