హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR Chitchat : 2024ఎన్నికలే లక్ష్యంగా BRS పని చేస్తుంది .. ముందు కర్నాటక, మహరాష్ట్రనే మా టార్గెట్ : KTR

KTR Chitchat : 2024ఎన్నికలే లక్ష్యంగా BRS పని చేస్తుంది .. ముందు కర్నాటక, మహరాష్ట్రనే మా టార్గెట్ : KTR

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR Chitchat: తెలంగాణను మోడల్‌ స్టేట్‌గా మార్చిన కేసీఆర్‌ దేశాన్ని కూడా అదే విధంగా మార్చాలనే ప్రయత్నంలో భాగంగానే జాతీయ రాజకీయాల్లోకి అఢుగుపెట్టడం జరిగిందని చెప్పారు కేటీఆర్. తమ పార్టీ ఎవర్ని ఓఢించాలనో జాతీయ పార్టీని నెలకోల్పలేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్‌ పని చేస్తుందన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కాస్తా భారత్ రాష్ట్ర సమితీగా మారింది. తెలంగాణలోని అధికార పార్టీ జాతీయ రాజకీయ పార్టీ(BRS)గా మార్పు చెందింది. ఈ సందర్భంగా ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ(Telangana)ను మోడల్‌ స్టేట్‌గా మార్చిన కేసీఆర్‌ దేశాన్ని కూడా అదే విధంగా మార్చాలనే ప్రయత్నంలో భాగంగానే జాతీయ రాజకీయాల్లోకి అఢుగుపెట్టడం జరిగిందని చెప్పారు కేటీఆర్. తమ పార్టీ ఎవర్ని ఓఢించాలనో జాతీయ పార్టీని నెలకోల్పలేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్‌ పని చేస్తుందని మీడియా చిట్‌చాట్‌(Media chitchat)లో చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్‌ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఏమన్నారంటే..

KTR Chitchat : ఓటుకు 30వేలు ఇచ్చైనా గెలుస్తామనే ధీమాలో BJP నేతలున్నారు .. కాని మునుగోడు ప్రజలు మావైపే ఉన్నారు: KTR

2024ఎన్నికలే మా లక్ష్యం:కేటీఆర్

టీఆర్ఎస్‌ పార్టీ బీఆర్ఎస్‌గా జాతీయ రాజకీయ పార్టీగా ఆవిర్భవించడానికి కేసీఆర్ ఆలోచన, ముందు చూపే కారణమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి చెప్పారు. బీఆర్ఎస్‌ రాజకీయ పోరాటం 2024ఎన్నికలే లక్ష్యంగా ఉంటుందన్నారు. ముందుగా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహరాష్ట్రాల్లో ఎన్నికలకు పోతామని తెలియజేశారు. బీఆర్ఎస్‌ పేరు ప్రకటించిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా కేసీఆర్‌ని విమర్శించడంపై మంత్రి కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన సమయంలో ...రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా వీళ్లకు ఏం పాలన చేతనవుతుందని చులకనగా మాట్లాడారని..అలాంటి విమర్శలు, వ్యాఖ్యలకు కేసీఆర్ 8ఏళ్ల పాలన సమాధానం చెప్పిందన్నారు మంత్రి కేటీఆర్ .

8ఏళ్ల పాలనే నిదర్శనం:కేటీఆర్

8ఏళ్ల పాలనలో కేసీఆర్‌ టీఆర్ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చామన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు జాతీయ పార్టీ గుర్తింపు, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. జాతీయ పార్టీ ఆవిర్భావం కేసీఆర్‌ ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదన్న కేటీఆర్ దేశంలోని చాలా మంది నేతలు, ఇతర పార్టీ నాయకులతో సంప్రదించి ..చర్చలు జరిపి..వారి అభిప్రాయాన్ని పరిగిణలోకి తీసుకొని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీజేపీ తక్కువ అంచనా వేసిన ఆప్‌ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో పాగా వేసిన తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగానే తాము కూడా ముందుగా కర్నాటక, మహరాష్ట్రలో గెలిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే రాయచూర్‌ని తెలంగాణలో కలుపమని అక్కడి జనం కోరుతున్న విషయాన్ని కేటీఆర్ చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. రాయచూర్‌తో పాటు పర్బాని, లాతూర్‌ని కూడా కలపాలని కోరుతున్నారని చెప్పారు కేటీఆర్.

Munugode Bypoll: కూసుకుంట్లే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి.. సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన

అదే కమిట్‌మెంట్‌తో బీఆర్ఎస్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్ కమిట్‌మెంట్, కంటెట్‌ , విజన్ ఉన్న నాయకుడని చెప్పుకొచ్చిన కేటీఆర్..ఆయన ప్రతికూల పరిస్థితుల మధ్య ఎదిగిన నాయకుడని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంపై దేశ ప్రజలకు నమ్మకం ఉందని ..అందుకే ఏపీ ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారని మంత్రి చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ స్టేట్‌గా ఉందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలే అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పొరుగు రాష్ట్రాలు సైతం కాపీ కొడుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Minister ktr, Telangana Politics, Trs

ఉత్తమ కథలు