హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: పార్టీ పేరు మారింది కానీ డీఎన్ఏ మారలేదు.. హుజూరాబాద్ సభలో కేటీఆర్

KTR: పార్టీ పేరు మారింది కానీ డీఎన్ఏ మారలేదు.. హుజూరాబాద్ సభలో కేటీఆర్

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR-Huzurabad: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే.. నిధుల వరద పారిస్తామని అప్పట్లో బీజేపీ నేతలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ 14 నెలల్లో ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తమ పార్టీ పేరు మారింది కానీ తమ పార్టీ డీఎన్ఏ మారలేదని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే దేవుడితో అయినా కొట్లాడతామని అన్నారు. గుజరాత్ పాలకుల చెప్పులు మోయడం బండి సంజయ్‌కు ఇష్టమేమో కానీ.. తెలంగాణ బిడ్డలకు ఆ అవసరం లేదని ఆరోపించారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ (KTR) మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను(Etela Rajendar)  గెలిపిస్తే.. నిధుల వరద పారిస్తామని అప్పట్లో బీజేపీ నేతలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ 14 నెలల్లో ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఈ విషయాన్ని హుజూరాబాద్ (Huzurabad) ప్రజలు గుర్తించాలని కోరారు. ఢిల్లీ నుంచి ఒక్క పైసా కూడా బీజేపీ నేతలు తీసుకురాలేదని విమర్శించారు.

బండి సంజయ్ ప్రధాని మోదీని దేవుడని అంటున్నారని.. ప్రజలపై మోయలేని భారం వేస్తున్న వ్యక్తి దేవుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ అన్నారు. మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. దమ్ముంటే తమతో అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయడం వీరి వల్ల కాదని కేటీఆర్ విమర్శించారు. మత చిచ్చు పెట్టడంలో బండి సంజయ్ నంబర్‌వన్ అని ఆరోపించారు.

హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కష్టపడుతున్నాడని.. ప్రజల్లో ఉండి ఇదే రకంగా శ్రమిస్తే ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కేటీఆర్ అన్నారు. అంతకముందు కేటీఆర్ హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ‌లాపూర్ మండ‌ల కేంద్రంలో ప‌ర్య‌టించారు.ఈ సంద‌ర్భంగా మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర‌, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల భ‌వ‌న స‌ముదాయాలు, ప్రభుత్వ జూనియ‌ర్ కాలేజీ భ‌వ‌నం, క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌యాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Big News: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ సోదాలు

Bandi Sanjay: ఆ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ పోటీ? గంగులను ఓడించడమే టార్గెట్ గా..!

ఈ కార్యక్రమాల్లో మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా బీసీ వెల్ఫేర్ బాలుర‌, బాలికల గురుకుల పాఠ‌శాల‌ల విద్యార్థుల‌తో కలిసి మంత్రి కేటీఆర్ భోజ‌నం చేశారు. విద్యార్థుల‌తో కేటీఆర్ ముచ్చ‌టించారు.

First published:

Tags: Etela rajender, KTR

ఉత్తమ కథలు