Home /News /telangana /

TS POLITICS MINISTER KTR EXPLAINED THAT THE AGITATION OF VISHWA BRAHMINS IN MAHABUBNAGAR DISTRICT IS FALSE PROPAGANDA SNR MBNR

Telangana| Ktr: కేటీఆర్ మాటలపై విశ్వబ్రాహ్మణులు గరం ..ప్రచారం అవాస్తమన్న మంత్రి

(మాటపై మంటలు)

(మాటపై మంటలు)

Mahabubnagar: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గంలో అగ్గిని రాజేశాయి. తమను చులకన చేసి మంత్రి మాట్లాడారంటూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆందోళనలకు దిగారు కులసంఘాల నేతలు. దీనిపై మంత్రి స్పందించారు. తన వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. ఎవరినైనా నొప్పిస్తే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలిపారు. విశ్వబ్రాహ్మణ

ఇంకా చదవండి ...
    (Syed Rafi, News18,Mahabubnagar)
    తెలంగాణ (Telangana)ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) చేసిన వ్యాఖ్యలపై విశ్వబ్రాహ్మణులు(Vishwabrahmans) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లా పరిధిలో విశ్వబ్రాహ్మణ కులస్తులు ఆందోళలు చేపట్టారు. మంత్రి కేటీఆర్ చారి పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. తమను కించపరిచే విధంగా మాట్లాడరని అదే సామాజికవర్గానికి చెందిన కొందరు మండిపడుతున్నారు. జిల్లాలో పలుచోట్ల కేటీఆర్ వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

    మాటలపై మంటలు..
    నాగర్ కర్నూల్ జిల్లా   కల్వకుర్తి మాజీ సర్పంచి బృంగి ఆనంద్ కుమార్‌తో పాటు ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని మరో రెండు వేల ఐదు వందల మంది ఇతర పార్టీల నాయకులు గులాపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆసమయంలోనే మంత్రి కేటీఆర్‌ కల్వకుర్తి నియోజకవర్గం బిజెపి నాయకుడు ఆచారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.



    మంత్రి వ్యతిరేకంగా నిరసనలు..
    వ్యక్తిని దూషించబోయి పేరుతో విమర్శించడంతో విశ్వబ్రాహ్మణులు మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్ చారి త్యాగం మర్చిపోయారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో ఊదరగొడుతున్నారు. ఇంకా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చారి సేవలు గుర్తు లేవా అంటూ నిలదీస్తున్నారు.మంత్రి చేసిన వ్యాఖ్యలకు గాను విశ్వబ్రాహ్మణ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

    ఇది చదవండి: గోడకేసి కొడతాం.. ఎవరూ మొనగాళ్లు కాదు.. సొంత పార్టీ సీనియర్ నేతకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్



    వ్యాఖ్యలపై మంత్రి వివరణ..
    గురువారం తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఖండించారు మంత్రి కేటీఆర్. విశ్వబ్రాహ్మణులను (చారీలను) నేను కించపరిచలేదన్నారు. అంతే కాకుండా ఓ కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు మంత్రి. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ఎవరైనా బాధపడి ఉంటే ఆ మాటను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు మంత్రి కేటీఆర్. అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటు న్నట్లుగా ప్రకటించారు. మంత్రి వివరణతో విశ్వబ్రాహ్మణుల ఆగ్రహం చల్లారినప్పటికి ఈ వార్తకు సంబంధించి సోషల్ మీడియాలో మాత్రం రచ్చ కొనసాగుతూనే ఉంది.

    ఇది చదవండి: ఖమ్మంలో లేడీగ్యాంగ్‌.. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పేరిట కోట్లలో వసూలు.. 


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Mahabubnagar, Minister ktr

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు