హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: శత్రుదేశం మీద దాడికి వచ్చినట్లు తెలంగాణకొస్తున్నారు: మంత్రి కేటీఆర్​

KTR: శత్రుదేశం మీద దాడికి వచ్చినట్లు తెలంగాణకొస్తున్నారు: మంత్రి కేటీఆర్​

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో చేపట్టిన ర్యాలీలో KTR పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  తెలంగాణలో (Telangana) ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR)​ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. భాజపా (BJP) చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో (Telangana Jateeya Samaikyata Diamond jubliee festivals) భాగంగా సిరిసిల్లలో (Sircilla) చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గత ఎనిమిదేళ్లుగా సిరిసిల్లలో పవర్‌లూమ్​ ఏర్పాటు చేయాలని కాకిలా మొత్తుకుంటున్నా.. పట్టించుకునే వారు లేరని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. రేపు తెలంగాణకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Union Home Minister Amit Shah).. ఈసారైనా నిధుల గురించి మాట్లాడతారా.. లేక డబ్బల రాళ్లు వేసి ఊపినట్లు ఊపుతారో చూడాలని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రానికి డబ్బుల గురించి అమిత్‌ షా ఇప్పుడైనా చెప్తారా? హిందువులు, ముస్లిలంటూ రెచ్చగొట్టి వెళ్తారో చూడాలి అని మంత్రి అన్నారు.

  ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ..  "భూమి కోసం భుక్తి కోసం తల్లి తెలంగాణ కోసం అమరుడైన ప్రతి వారిని గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్  (Hyderabad)పై దండయాత్ర కు కేంద్ర హోం మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తున్నారు. మతం పేరిట చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. శత్రు దేశం మీద దాడికి పోయినట్టు తెలంగాణ లో రాజకీయ చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మీ పాత్ర ఉందా మీ నాయకుల పాత్ర ఉందా? స్వతంత్ర ఉద్యమంలో మా కుటుంబ పాత్ర ఉంది. మా తాత నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఉన్నాడు.

  తెలంగాణ పచ్చగా ఉంటే సహించలేక ఇట్లా వ్యతిరేక సభలు పెడుతున్నారు. ఎనిమిది ఏండ్లలో 10 సార్లు వచ్చి ఒక్క రూపాయి అయిన ఇచ్చారా? హిందూ ముస్లిం అంటమే తప్ప బండి సంజయ్ జిల్లాకు ఏమన్నా తెచ్చాడా.? బీజేపీ వాళ్ళు అన్ని బోగస్ ముచ్చట్లు బోగస్ కథలు చెబుతారు. మనం రూపాయి కడితే నలభై పైసలు ఇస్తున్నారు.

  బండి సంజయ్ ఏం చేసిండు?

  మోదీ కాశీలో ఏమి చేసిండు ఇక్కడ బండి సంజయ్ ఏం చేసిండు. మసీదులు తవ్వుదాం అనడం తప్ప ఏం తెలుసు. తవ్వుదాం బీడు భూముల్లో నీటికోసం, మెడికల్ కాలేజీలు పెట్టేందుకు తవ్వుదాం. దేశంలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీ ల్లో మనవే 19 ఉంటాయి. బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఇక్కడి కంటే ఎక్కువ పథకాలు పేదలకు ఉన్నాయో చెప్పు మేం వస్తాం చర్చిద్దాం

  బండి సంజయ్ ఉచిత విద్య ఉచిత వైద్యం ఎక్కడ ఉందని ఇక్కడ పెడతా అన్నావ్. పార్లమెంట్ లో తీర్మానం చేయండి మేము సపోర్ట్ చేస్తాం. తెలంగాణ నూతన సచివాలయంకి అంబెడ్కర్ పేరు పెట్టుకున్నాం. మీ చేతనైతే అంబేడ్కర్​ మీద ప్రేమ ఉంటే పార్లమెంట్ కు పెరు పెట్టండి.”అని అన్నారు కేటీఆర్​.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Karimnagar, KTR, September 17, Trs, Vemulawada

  ఉత్తమ కథలు