TS POLITICS MINISTER INDRAKARAN REDDY SAID THAT CHIEF MINISTER KCR HAD INTRODUCED SEVERAL SCHEMES AIMED AT THE ECONOMIC PROGRESS OF THE DALITS IN THE SPIRIT OF AMBEDKAR ADB PRV
Ambedkar Birth Anniversary: "అంబేడ్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారు": మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంబేడ్కర్ జయంతి వేడుకలో ఇంద్రకరణ్
అంబేడ్కర్ స్పూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
అంబేడ్కర్ స్పూర్తి (spirit of Ambedkar)తో దళిత (dalit) జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indra Karan Reddy) అన్నారు. ఇందులో భాగంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు దళితుల అభ్యున్నతి (Advancement of Dalits) కోసం 60 వేల కోట్లు వెచ్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. దళిత బంధు (dalith Bandhu) పథకానికి 17 వేల 700 కోట్లు కేటాయించి ఈ పథకం ద్వారా 17 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చినట్లు మంత్రి వివరించారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 131వ జయంతి (Ambedkar Birth Anniversary) సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
విద్య, ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ..
అంతకుముందు నిర్మల్ లోని మినిట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి తో కలిసి మంత్రి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, పలు సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇందులో విద్య, ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సంక్షేమ పథకాలు దళిత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని తెలిపారు.
దళిత కుటుంబానికి ప్రత్యక్షంగా మేలు చేసేలా..
దళితుల్లో అన్ని కేటగిరీల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్రేతర మేధావుల సైతం ప్రశంసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతు బంధు తరహాలో ప్రతి దళిత కుటుంబానికి ప్రత్యక్షంగా మేలు చేసేలా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశల వారీగా రాష్ట్రంలోని కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యంగా 2022-23 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రత్యక్షంగా 17 లక్షల కుటుంబాలకు పరోక్షంగా కోటి మందికి దళిత బంధు పథకం ద్వారా మేలు జరగనుందన్నారు.
దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలు, గురుకుల సంక్షేమ హాస్టళ్లు, ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ స్టడీ సర్కిళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా ఎస్సీ గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మార్కెట్ కమిటీ, వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు, ముధోల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు, ఖానాపూర్ నియోజకవర్గానికి 61 యూనిట్లకు దళితబంధు పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సుమారు రూ. 5 కోట్లతో అంబేడ్కర్ భవన్ నిర్మించుకున్నాం. ఈ నెల 18న ఈ భవనాన్ని ప్రజలకు అందుబాటులో కి తెస్తున్నామని తెలిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.