హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చెయ్​.. షర్మిలకు మంత్రి సవాల్​

Telangana: రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చెయ్​.. షర్మిలకు మంత్రి సవాల్​

వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. వైఎస్సార్​ కుమార్తెగా తెలంగాణలో జెండా పాతాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమెకు తాజాగా అధికార పార్టీ టీఆర్ఎస్​ నుంచి సవాల్ ఎదురైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Wanaparthy, India

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP President YS Sharmila) విమర్శలకు మంత్రి నిరంజన్ రెడ్డి  (Minister Niranjan reddy) కౌంటర్ ఇచ్చారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే ఒక్క మాటకు వంద మాటలు అంటామని మంత్రి మండిపడ్డారు. శనివారం వనపర్తి (Wanaparti) జిల్లా గోపాల్ పేట మండల పరిధిలో నూతన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నిరంజన్ రెడ్డి షర్మిల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం ప్రజాప్రస్థానం పాదయత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మంత్రి నిరంజన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. గతంలో తనను ఉద్దేశించి నిరంజన్ రెడ్డి చేసిన మరదలు కామెంట్స్ పై ఆమె నిప్పులు చెరిగారు.

మంత్రి నిరంజన్​ రెడ్డి (ఫైల్​)

తనను మంగళవారం మరదలన్నాడని.. ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గుండాలంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అని ఆమె ఫైరయ్యారు. ఈయనకు కుక్కకు ఏమైనా తేడా వుందా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అధికార మదం తలకెక్కిందా... నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలకు ముందు డబ్బులు లేని నిరంజన్ రెడ్డికి మంత్రి అయ్యాక కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని నిలదీశారు.

షర్మిల చేసిన విమర్శలపై స్పందించిన నిరంజన్ రెడ్డి అహంకారంతో మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతామన్నారు. షర్మిల మాటలు చెప్పడం కాదని దుయ్యబట్టారు. రాజన్న బిడ్డవైతే రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో (Munugodu By elections) పోటీ చేసి  సత్తా ఏంటో చూపించాలని షర్మిలకు నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.

కాగా, అంతకుముందు వనపర్తిలో మాట్లాడిన షర్మిలా సీఎం కేసీఆర్​ (CM KCR)పై విమర్శలు గుప్పించారు.  వైఎస్సార్ చనిపోయి 13 ఏళ్లు అయినా ఇవ్వాల్టి వరకు ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని, ఆ మహానేత కు మరణం లేదన్నారు. వైఎస్సార్ అమలు చేసిన ప్రతి పథకం అద్భుతం అని, ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్.. పరిపాలన అంటే వైఎస్ఆర్ ది అని కొనియాడారు. కేసీఆర్ 8 ఏళ్ల ముఖ్యమంత్రి గా వనపర్తి కి ఏమైనా ఇచ్చారా..? ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని ఆరోపించారు. కేసీఆర్ అమలు చేస్తామని చెప్పిన ప్రతి పథకం బూటకమే.. జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు.

వనపర్తి నియోజక వర్గానికి నీళ్ళు పారించిన ఘనత వైఎస్సార్ ది అని, భీమా ఫేస్ 2, ఓ కల్వకుర్తి ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు అందించారన్నారు. 104, పావులా వడ్డీ పథకాలు ఇక్కడ నుంచే మొదలు పెట్టారన్నారు. కరివెన రిజర్వాయర్ వద్ద గుడిసె వేసుకొని పూర్తి చేస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై కేసీఆర్ కి ప్రేమ లేదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు నీళ్ళ నిరంజన్ రెడ్డి కాదు.. కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి అన్నారు.

First published:

Tags: Niranjan Reddy, Wanaparthi, YS Sharmila, Ysrtp

ఉత్తమ కథలు