TS POLITICS MINISTER HARISH RAO TWEETED COMPARING UNION HOME MINISTER BJP LEADER AMIT SHAH TO MIGRATORY BIRDS PRV
Amit shah | Harish rao: అమిత్ షా వలస పక్షి.. మంత్రి హరీశ్ రావు షాకింగ్ ట్వీట్..
హరీశ్ రావు పోస్టు చేసిన చిత్రం
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. అయితే అమిత్ షా రాష్ట్ర పర్యటనపై మంత్రి హరీశ్‌రావు సెటైరికల్ ట్వీట్ చేశారు.
బండి సంజయ్ (Bandi sanjay) రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama Yatra) ముగింపు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) పాల్గొననున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister harish rao) సెటైరికల్ ట్వీట్ (Tweet) చేశారు. వలస పక్షులు (Migratory birds) తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయన్నారు. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికమని హరీశ్‌రావు పేర్కొన్నారు. #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగులను హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇలా పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ సెటైర్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ మారింది.
అంతకుముందే అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ (Minister KTR) బహిరంగ లేఖ (Open Letter) రాశారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష అలానే ఉందని మంత్రి ఆరోపించారు. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ (Telangana) కడుపు కొట్టడం మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణపై బీజేపీది అదే కక్ష. ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదు. ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు ఇదే బీజేపీ కేంద్ర నాయకులకు అలవాటుగా మాదింది. ఇంకెంత కాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని బీజేపీ.. గుజరాత్ కు మాత్రం ఇవ్వని హామీలు కూడా ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతం. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లింది’’ అని విమర్శించారు కేటీఆర్.
అమిత్ షాకు కవిత వెరైటీ స్వాగతం..
మరోవైపు అటు సీఎం కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమిత్ షాకు వెరైటీగా స్వాగతం పలికారు. తెలంగాణకు వెల్కమ్ అంటూనే అమిత్ షాపై ప్రశ్నల బాణాలు సంధించారు. ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు.
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, GST పరిహారం: రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటి అని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.