Telangana: తెలంగాణ రాష్ట్రానికి దిశ, దశ ఏర్పడింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అన్నారు మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్. ఏడు దశాబ్ధాల కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పాలనలో తెలంగాణ ప్రజలు పూర్తిగా నష్టపోయారని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.
(Syed Rafi, News18,Mahabubnagar)
తెలంగాణ రాష్ట్రానికి దిశ, దశ ఏర్పడింది టీఆర్ఎస్(Trs) ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అన్నారు మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్. ఏడు దశాబ్ధాల కాంగ్రెస్(Congress), బీజేపీ, టీడీపీ(TDP) పాలనలో పూర్తిగా తెలంగాణ ప్రజలు నష్టపోయారని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో సోమవారం(Monday) కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్ధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ( Health Minister)హరీష్‌రావు(Harishrao), ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud) నారాయణపేట(Narayanpeta)జిల్లాలో పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో రూ. 64.43 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు మంత్రులు హరీష్‌రావు. శ్రీనివాస్ గౌడ్. అప్పంపల్లిలో రూ. 56 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో కూడిన 390 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు.
అభివృద్ధే లక్ష్యం..
ఎర్రగుట్ట నుండి ఎక్లాస్పూర్ మీదుగా కర్ణాటక బోర్డర్ వరకు రూ. 5.98 కోట్ల వ్యయంతో నిర్మించిన 5.5 కి.మీ బి.టి రోడ్డును ప్రారంభించారు. అత్యాధునిక వసతులు, ఆధునిక పరికరాలతో రూ. 1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. అన్నీ రకాల వైద్య పరీక్షలు నిర్వహించే టి. డయాగ్నస్టిక్ సెంటర్, రేడియాలజీ సెంటర్‌ను రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో శంఖుస్థాపన చేశారు. రూ. 45 లక్షల అంచనా వ్యయంతో నారాయణపేట జిల్లాలో కెమిస్టు , డ్రగ్గిస్టు అసోసియేషన్ భవనమునకు శంఖుస్థాపన చేశారు.
ఇది చదవండి : జగిత్యాల జిల్లా ప్రజలు జర జాగ్రత్త ..మీకొచ్చే డబ్బుల్లో దొంగనోట్లు ఉన్నాయంట
గతంలో అభివృద్ధి శూన్యం..
అటుపై బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. డెబ్భై సంవత్సరాల్లో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేవలం 3 వైద్య కళాశాలలు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడేళ్లలో ఆ సంఖ్య33 కు చేరిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కడో మూలకు పడివున్న నారాయణపేటకు జిల్లా హోదా కల్పించడమే కాకుండా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా ప్రాంత విద్యార్ధులు మెడిసిన్‌తో పాటు టీచర్లు కావాలన్న ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు హరీష్‌రావు. 95శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు.
ఇంకా విషం చిమ్ముతున్నారు..
మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం నారాయణపేట అభివృద్ధి టీఆర్ఎల్ పాలనలోనే జరిగిందన్నారు. గతంలో హైదరాబాద్ తర్వాత అంతటి పేరున్న నారాయణపేట మున్సిపాలిటీని ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం విషం చిమ్ముతోందన్నారు. రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించడం వెనుక ఆంతర్యం అదేనన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కేవలం మతం పేరుతో ఒకరు కులం పేరుతో మరొకరు రాష్ట్రంలో విధ్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు శ్రీనివాస్‌గౌడ్. జిల్లాలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మంత్రుల ముందుంచారు జిల్లా ప్రజాప్రతినిధులు. వాటిపై కూడా మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.