Home /News /telangana /

TS POLITICS MINISTER HARISH RAO CRITICIZED TELANGANA BJP LEADERS BANDI SANJAY AND KISHAN REDDY FOR NOT RESPONDING TO KTR CHALLENGE PRV

Telangana Politics | Harish rao: కేటీఆర్​ సవాల్​పై మంత్రి హరీశ్​ రావు కీలక వ్యాఖ్యలు.. వాళ్లవి డొంక తిరుగుడు మాటలంటూ విమర్శలు 

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌,  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు దమ్ముంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తేవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు.  అంతేకాదు ఈ సందర్భంగా కేటీఆర్​ సవాల్​పై హరీశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (bandi sanjay),  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy)లకు దమ్ముంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తేవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సవాల్ విసిరారు.  బండి సంజయ్‌ పాదయాత్రలో అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, ఆయన గోబెల్స్‌ను మించిపోయారని మంత్రి విమర్శించారు.  హక్కుగా రావాల్సిన బకాయిలకే గతి లేదని, వేరే నిధుల గురించి బీజేపీ నేతలు(Telangana BJP leaders) మాట్లాడుతున్నారని విమర్శించారు. కాకి కబుర్లు చాలించి.. తెలంగాణకు రూ.3లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని బీజేపీ (BJP) జూటా ప్రచారం చేసుకోంటుందని మండిపడ్డారు. శనివారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    రూ.4లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుందని..

    పెట్రోల్‌ ఉత్పత్తులపై నాలుగు రకాల సుంకాలు కేంద్రం విధిస్తోందని, యూపీఏ హయాంలో కన్నా పెట్రో ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెరిగాయని హరీశ్‌రావు ఆరోపించారు.  గత సంవత్సరం కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రూ.4లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుందన్నారు. తెలంగాణది సంక్షేమ ప్రభుత్వమని, కేంద్రానిది సతాయించే ప్రభుత్వమని మండిపడ్డారు. గ్యాస్‌ సిలిండర్‌ రేటును రూ.400 నుంచి రూ.1000కి పెంచలేదని చెప్పగలరా?.. తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. 15లక్షల ఉద్యోగ ఖాళీలు కేంద్రంలో ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయరని ప్రశ్నించారు.

    సవాల్​పై సమాధానం చెప్పరేం..?

    మంత్రి కేటీఆర్‌ (Minister KTR) స్పష్టంగా లెక్కలు చెప్పి.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని చెప్పారని అన్నారు. కేటీఆర్‌ సవాల్‌ (KTR Challenge)పై బీజేపీ నేతలు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు హరీశ్​. కేటీఆర్​ ఛాలెంజ్​పై బీజేపీ నేతలు (BJP Leaders) డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని, వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు మంత్రి  (Minister Harish Rao) విమర్శలు (Criticized) చేశారు. ఆర్థికమంత్రిగా తాను సాధికారికంగా నిధులకు సంబంధించి లెక్కలు విడుదల చేస్తున్నానన్నారు. మనకు హక్కుగా రావాల్సిన రూ.7183కోట్ల బకాయిలు కూడా తొక్కి పెట్టారనీ, ఎన్నిసార్లు కేంద్ర ఆర్థికమంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమన్నారు.

    బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా?..

    బండి సంజయ్​ (Bandi sanjay)పై హరీశ్​ రావు విమర్శలు గుప్పించారు. అన్నీ నిధులు పంచాయతీలకు కేంద్రమే..  ఇస్తుంటే తెలంగాణలాగా గ్రామాల్లో ట్రాక్టర్లు డంప్ యాయార్డులు వైకుంఠ ధామాలు వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు బండి సంజయ్‌కు కనిపించడం లేదని బొంకుతున్నాడని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆసరా పెన్షన్లు తెలంగాణ తరహాలో మరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా? రూ.3వేల పెన్షన్ తెలంగాణలో తప్ప ఎక్కడైనా ఇస్తున్నారా? ఆసరా పెన్షన్లలో తెలంగాణకు కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 3శాతం లోపేనని.. బీజేపీ నేతలు ఆసరాపై బోగస్ మాటలు మానాలని హితవు పలికారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో మలేరియా కేసులు తగ్గాయని కేంద్రమే అవార్డు ఇచ్చిందని మంత్రి హరీశ్‌రావు  (Minister Harish Rao) గుర్తు చేశారు. ఇది సంజయ్‌కి కనిపించడం లేదా? అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Harish Rao, Kishan Reddy, KTR, Telangana bjp, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు