TS POLITICS MINISTER HARISH RAO CRITICIZED CONGRESS LEADER RAHUL GANDHI AND THE BJP AT A MEETING IN NIZAMABAD DISTRICT NZB PRV
Harish rao| Rahul gandhi: "రాహుల్‌గాంధీ.. నీ ఇల్లే సక్కగ లేదు.. తెలంగాణకొచ్చి నువ్వు చేసేదేముంది?”: మంత్రి హరీశ్ రావు
హరీశ్ రావు , రాహుల్ (ఫైల్)
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రాహుల్ గాంధీ ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడికెళ్ళినా ఓటమి తప్ప గెలుపు లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు మంత్రి గారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడికెళ్ళినా ఓటమి తప్ప గెలుపు లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాక మంత్రి తన్నీరు హరీశ్ (Minister Harish Rao) రావు ఎద్దేవా చేశారు. దేశంలో రాహుల్ పర్యటించిన చోట 94 శాతం ఓటమి.. 6 శాతం గెలుపు అని మంత్రి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ.. నీ ఇల్లే సక్కగా లేదు.. నువ్వు వచ్చి తెలంగాణలో చేసేది ఏం లేదని వ్యాఖ్యానించారు. ‘‘నువ్వు వచ్చి తెలంగాణ లో పొడిచేదేముంది.. కాంగ్రెస్ పార్టీ ది ఓడిన కథ’’ అన్నారు. బీజేపీ (BJP) కేంద్రంలో అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదన్నారు మంత్రి. నల్ల చట్టలు తీసుకు వచ్చిన బీజేపీ మెడలు.. మా రైతులు వంచారని హరీశ్ వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. కామారెడ్డి (Kamareddy) జిల్లా నస్రుల్లా బాద్ మండలంలోని దుర్కిలో 40 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన సముదాయానికి.. వర్ని మండలం జాకోర గ్రామం వద్ద రూ. 69.52 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న జాకోర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీష్ రావు, శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు.
రైతులు సుఖంగా ఉంటారని..
అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించిన మంత్రి హరీశ్ రావు (Harish rao) మాట్లాడుతూ.. భాజపా చేసింది ఏమీ లేదు నల్ల చట్టం తీసుకురావడం తప్ప అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ (TRS) నిజాయితీ.. బీజేపీదీ తొండి మాటలు తప్ప ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ (Congress) బీజేపీలు కష్టపడితేనే తమ రైతులు సుఖంగా ఉంటారని మంత్రి చెప్పారు. రైతులు (farmers) సుఖంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని చెప్పారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినపుడు డీజిల్ ధర రూ .70 ఉందని.. కానీ ఇప్పుడు రూ. 100 దాటిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రైతులు ఎకరం పొలం దున్నడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేదని ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన మండిపడ్డారు.
శంకుస్థాపనలో మంత్రి హరీశ్
బీజేపీ (BJP)మెడలు వంచి నల్ల చట్టాలను రద్దు చేయించిన ఘనత మా రైతులదని మంత్రి అన్నారు. వ్యవసాయ బోరు మోటర్ లకు మీటర్లు బిగిస్తే డబ్బులు ఇస్తానని కేంద్రం చెబితే ఆంధ్ర సీఎం జగన్ డబ్బులు తీసుకున్నాడు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక పూట పస్తులు ఉన్నా సరే.. రైతులకు నష్టం కలిగించేది లేదని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ లో వ్యవసాయ బోరు మోటార్లకు మీటర్లు బిగించేదే లేదని చెప్పారు.
90 వేల ఉద్యోగాల భర్తీ..
వరి ధాన్యం(Paddy) కొనుగోలు విషయంలో కేంద్రం కొనం అంటే.. ఆ నూక డబ్బులు భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నారు మంత్రి.. రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 90 వేల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని, మరి కేంద్రం పరిధిలోని 9 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని అడగాలని ఆయన బండి సంజయ్ ను ప్రశ్నించారు.
బీజేపీ 80- 20 ఫార్ములా వాడుతుంది.. కానీ రాష్ట్రంలో 80 శాతం పేదలు ఉంటే 20 శాతం ధనికులు ఉన్నారు.. మీరు ఎటువైపు అని మంత్రి భాజపాను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అన్నారు మంత్రి హరీశ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జీవన్ రెడ్డి, కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.