హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister Errabelli Dayakar Rao: ఆ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన కామెంట్స్..వారికి సీటు గండం తప్పదా?

Minister Errabelli Dayakar Rao: ఆ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన కామెంట్స్..వారికి సీటు గండం తప్పదా?

సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఫొటో)

ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ (Cm Kcr) పై ప్రజలకు నమ్మకం ఉంది. కానీ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది. ఆ ఎమ్మెల్యేలను మారిస్తేనే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది. లేదంటే 90 సీట్లకే పరిమితం అవుతుంది. నా సర్వే ఎప్పుడూ తప్పు కాలేదని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కాగా ఇప్పటికే సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

KCR: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ.. ఆ పార్టీలకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారా ?

ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ తో ఆ 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జోరుగా కొనసాగుతుంది. అయితే సాధారణంగా బీఆర్ఎస్ లో సొంత నాయకుల మధ్య కుమ్ములాట సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇటీవల హైదరాబాద్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి తీరుకు వ్యతిరేకంగా భేటీ అయిన దగ్గరి నుండి  అంతర్గత కుమ్ములాటకు  బీఆర్ఎస్ కూడా అనర్హం కాదన్నట్టు ఉంది పరిస్థితి. ఇక ఆ తరువాత ఖమ్మం రాజకీయాలతో ఈ అంతర్గత ఫైటింగ్ పీక్స్ కు చేరింది. ఈ కుమ్ములాటలు పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉండడంతో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పొంగులేటికి పొమ్మనలేక పొగబెట్టినట్టు సెక్యూరిటీ కూడా తగ్గించారు. దీనితో పార్టీలో ఎటువంటి ఇబ్బందులు లేవని అంతా అనుకున్నారు. కానీ ఎర్రబెల్లి వ్యాఖ్యలతో ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

Telangana News: పొరుగు జిల్లాలపై పొంగులేటి నజర్..ఎత్తుకు పైఎత్తులు ఫలించేనా?

కేసీఆర్ ఆ నిర్ణయం మార్చుకుంటారా?

కాగా గతంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో కీలక ప్రకటన చేశారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకోబోతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఈ క్రమంలో ఏకంగా 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త అభ్యర్థులను పెట్టడం అనేది సాహసోపేతమైన నిర్ణయంగానే చెప్పుకోవాలి. ఇక కొత్త అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి గెలవాలంటే మాటలు కాదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుండి బీఆర్ఎస్ కు నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ నిర్ణయాన్ని మార్చుకొని పార్టీకి నష్టం చేసుకోరని తెలుస్తుంది.

కాగా ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  (Minister Errabelli Dayakar Rao) వ్యాఖ్యలు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తున్నాయి. మరి ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

First published:

Tags: BRS, CM KCR, Errabelli Dayakar Rao, Telangana, Telangana Politics

ఉత్తమ కథలు