ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin owaisi) శనివారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. మండలి ఛైర్మన్ (Telangana council chairman) , డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR)తో అసదుద్ధీన్ చర్చించినట్లు సమాచారం. మండలి డిప్యూటీ ఛైర్మన్, విప్ పదవి కోసం అసదుద్దీన్ (MP Asaduddin owaisi) సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. పదవుల గురించి చర్చించలేదని.. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశానని అసదుద్దీన్ పేర్కొన్నారు.
ఇక ఏం చేస్తారనేది జీ 23 నేతలే చెప్పాలి..
కాగా, అసద్ (MP Asaduddin owaisi) మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ల ఫలితాల ప్రభావం ఇక్కడ వుండబోదని అసద్ బల్లగుద్ది చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడిందని.. ఇక ఏం చేస్తారనేది జీ 23 నేతలే చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు క్వార్టర్ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM narendra Modi) కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయని ఒవైసీ వ్యాఖ్యానించారు. దీని వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు అసదుద్దీన్ . ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టినా కూడా బీజేపీ తమకు శత్రువేనని ఆయన అన్నారు.
యూపీ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని, యూపీ ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వేర్వేరు అన్నారు. యూపీ సీఎం మంచి జోష్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మంచి మాటకారి అని ఆదిత్యనాథ్ తీరుపై కితాబిచ్చారు. అయితే ఎన్నికల ఫార్ములా ఇక్కడ పనిచేయదన్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తే హత్య యత్నం చేశారు. అఖిలేష్ యాదవ్ నెల ముందు నుంచి పరీక్షకు సిద్ధమవుతారని. డిస్టింక్షన్ కొట్టాలంటే ముందు నుంచే సిద్ధంగా ఉండాలని హితవు పలికారు.
గుజరాత్ , రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ..
తెలంగాణ (telanagna)లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది... ఎన్నికలు వచ్చాకే చెబుతామని ఒవైసీ స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పాటైతే.. దక్షిణ భారతదేశం నష్టపోతుందన్నారు. అది ఉద్యమానికి కారణమవుతుందని అసదుద్దీన్ (MP Asaduddin owaisi) హెచ్చరించారు. గుజరాత్ , రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగానే వుంటామని చెప్పారు.
సోమవారం ఉదయం చైర్మన్ పదవికి ఎన్నిక..
ఈ నెల 14వ తేదీన శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సభ్యులకు మండలి అధికారులు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుతం మండలి ప్రొటెం చైర్మన్‌గా సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
జూన్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta sukender reddy) , వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల (Nethi vidhyasagar) ఎమ్మెల్సీ సభ్యత్వ కాలం ముగిసింది. దీంతో ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలిలోని ఖాళీలన్నీ భర్తీకావడంతో తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రకటన వెలువడింది.
కొత్త ఛైర్మన్ ఎంపికకు సంబంధించి గవర్నర్ కు సమాచారం ఇచ్చిన మండలి అధికారులు..నూతన ఛైర్మన్ ఎంపికకు సంబంధించి అనుమతి తీసుకున్నారు. అయితే, అధికార పార్టీకి మండలిలో మెజార్టీ ఉండటంతో ఎవరికి మండలి ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం ఇస్తారనే అంశంపైన చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIMIM, Asaduddin Owaisi, Telangana Politics, TS Congress