Home /News /telangana /

TS POLITICS MANY TELANGANA CONGRESS LEADERS WILL NOT GET TICKETS IF RAHUL GANDHI FOLLOW THE NEW PLAN AK

Telangana Politics: కాంగ్రెస్‌లో కొత్త లెక్క.. తెలంగాణ నేతలకు టెన్షన్.. అదే జరిగితే.. వాళ్లంతా ఔట్ ?

తెలంగాణ, రాహుల్ గాంధీ (ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ, రాహుల్ గాంధీ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ గతంలో అవలంభించిన అనేక మూస విధానాలకు ఈసారి చెక్ చెప్పాలని చూస్తోందని.. అదే జరిగితే.. ఈసారి అనేకమంది సీనియర నేతలకు టికెట్లు రాకుండా పోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

    తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు కానీ.. అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. టీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి తన వ్యూహాలను పదునుపెడుతుంటే.. బీజేపీ కూడా తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో అధికారం సాధించాలనే పట్టుదలతో ఉన్నారని.. బీజేపీ పొలిటికల్ ప్లాన్స్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో బలపడేందుకు ఎంతగానో కష్టపడుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై తీవ్రంగా దృష్టిపెట్టడం.. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించడంతో.. కాంగ్రెస్‌లోనూ కొంత ఉత్సాహం కనిపిస్తోంది.

    అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మాట అటుంచితే.. కాంగ్రెస్ నేతల్లో మాత్రం రాహుల్ గాంధీ సరికొత్త ఆలోచనలు టెన్షన్ పెడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సలహాలను రాహుల్ పాటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇస్తారనే విషయం సునీల్ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఉంటుందనే చర్చ జరుగుతోంది.

    రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మరోసారి టికెట్ ఇవ్వకూడదని సునీల్ కనుగోలు ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను తీవ్రంగా కలవరపెడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సీనియర్లుగా చెప్పుకునే అనేక మంది నేతలు వరుసగా రెండు మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ దక్కుతుందా లేదా అనే కలవరం మొదలైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో నాయకుడి పనితీరును కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారని మరికొందరు చెబుతున్నారు.

    కాంగ్రెస్ పార్టీ గతంలో అవలంభించిన అనేక మూస విధానాలకు ఈసారి చెక్ చెప్పాలని చూస్తోందని.. అదే జరిగితే.. ఈసారి అనేకమంది సీనియర నేతలకు టికెట్లు రాకుండా పోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ విషయంలో రాహుల్ గాంధీ ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ? ఆయన ఎక్కువగా నమ్ముతున్న ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆయనకు ఏ రకమైన సలహాలు ఇస్తారు ? దాని వల్ల తమ పరిస్థితి ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్న అనేకమందిని కలవరపెడుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు