Home /News /telangana /

TS POLITICS MANY DOUBTS ABOUT THE ABSENCE OF TRS MLC PATNAM MAHENDER REDDY COUPLE FROM CM KCR MEETING SNR

Telangana : కేసీఆర్ మీటింగ్‌కి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు దూరం .. బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం

KCR PATNAM PHOTOS

KCR PATNAM PHOTOS

Telangana: కీలక పదవుల్లో ఉండి అధికార పార్టీకి చెందిన దంపతులిద్దరూ సీఎం కేసీఆర్ మీటింగ్‌కి వెళ్లకపోవడంపై కొత్త చర్చ జరుగుతోంది. గులాబీ బాసే వాళ్లను ఆహ్వానించ లేదా ..? లేక వాళ్లే పక్క చూపులు చూస్తున్నారా ..? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణ (Telangana)అధికార పార్టీలో వర్గవిభేదాలు, ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఏ జిల్లాలో చూసిన నేతల మధ్య సఖ్యత కొరవడినట్లుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌(Hyderabad)చుట్టుపక్కల జిల్లాల్లో లీడర్ల మధ్య డామినేషన్‌ పార్టీకి పెద్ద మొత్తంలో డ్యామేజీ చేసే విధంగా తయారైంది. నిన్న, మొన్నటి వరకు స్థానికంగా ఆధిపత్యం ప్రదర్శించుకున్న నేతలు సాక్షాత్తు గులాబీ బాస్ నిర్వహించిన సమావేశానికి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి(Former Minister)ఆయన సతీమణి డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్లిద్దరి వాలకం చూస్తుంటే పొలిటికల్‌(Political)గా మైండ్ సెట్ మార్చుకున్నారా అనే సందేహాలు జిల్లా ప్రజల్లో కలుగుతున్నాయి.

Jaggareddy | Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన అదే .. నవంబర్‌ 5న ముహుర్తం ఫిక్స్పట్నం చూపు ఎటు వైపో..?
మాజీ మంత్రి, వికారాబాద్ జిల్లాలో జిల్లా కీలకనేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్‌రెడ్డి ఏం చేయబోతున్నారు..? ఎందుకు పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉంటున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. గురువారం సీఎం కేసీఆర్వికారాబాద్‌ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కనిపించకపోవడమే దీనంతటికి కారణం. జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అందరూ హాజరైన ఈభేటీకి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి డుమ్మా కొట్టారు.డుమ్మా కొట్టడానికి కారణం అదేనా ..?
చాలా రోజులుగా పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు జిల్లాకు చెందిన నేతలకు ఏమాత్రం పొసగడం లేదు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో వర్గ విభేదాలు ఉన్నాయి. పలుమార్లు బయటపడ్డాయి. కొన్ని సందర్బాల్లో బాహాబాహీకి కూడా దిగారు. ఈవిషయం పార్టీ అధినాయకుడి దృష్టికి వెళ్లినప్పటికి లైట్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఎమ్మెల్సీగా పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌గా ఉన్న ఆయన సతీమణి మాట చెల్లకుండా జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ఎమ్మెల్యేలు మాత్రమే జిల్లాలో వ్యవహారాలు చక్కబెట్టడంతో పట్నం దంపతులు నిదానంగా ప్రజల్లో ఫేడ్ అవుట్ అవుతూ వచ్చారు. పార్టీ అధిష్టానం కూడా పట్నం దంపతుల్ని కాదని ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

Double Murders : పెళ్లి చేయమని అడుగుతుంటే పట్టించుకోలేదనే కోపంతో తండ్రి, బాబాయ్‌ని కొడుకు ఏం చేశాడో తెలుసా..?జంప్‌ తప్పదా ..?
గత కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుతో పట్నం దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించే పనిలో ఉన్న బీజేపీ నేతలు పట్నం దంపతులతో కూడా టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అందుకే పట్నం మహేందర్‌రెడ్డి ఆయన సతీమణి ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా నేతల సమావేశానికి గైర్హాజరు అయ్యారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

ఎవరికి నష్టం కలిగేనో ..?
ఈనెల 16వ తేది నుంచి స్వయంగా సీఎం కేసీఆర్వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆసందర్భంగా జిల్లా నేతలతో తన టూర్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక ఏర్పాట్లపై చర్చించారు. అలాగే జిల్లాలో నెలకొన్న గ్రూప్‌ రాజకీయాల్ని సైతం సర్ది చెప్పాలని అందర్ని ఆహ్వానించారు. పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు పక్క చూపులు చూస్తున్నారనే ఆలోచనతోనే సీఎం కార్యాలయం నుంచి వారికి ఆహ్వానం పంపలేదా లేక ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌ పర్సన్‌ ఇద్దరూ వేరే పార్టీలోకి మారే అవకాశం ఉండటం వల్లే సమావేశానికి దూరంగా ఉన్నారా అనే సందేహాలు జిల్లా ప్రజల్లో కలుగుతున్నాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana Politics, TRS leaders, Vikarabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు