Home /News /telangana /

TS POLITICS MANIKYAM TAGORE REACTED TO MARRI SHASIDHAR REDDY COMMENTS AND THE NEWS OF PRIYANKA GANDHI ARRIVAL AS TELANGANA CONGRESS IN CHARGE PRV

Congress: తెలంగాణకు కాంగ్రెస్​ ఇన్​ఛార్జ్​గా ప్రియాంకా గాంధీ?.. మాణిక్కం ఠాగూర్​ రియాక్షన్​ ఇదే..

మాణిక్కం ఠాగూర్​ (ఫైల్​ )

మాణిక్కం ఠాగూర్​ (ఫైల్​ )

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​లో నేతల మధ్య విభేదాలు, శశిధర్​ రెడ్డి వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ రాక తదితర విషయాలపై ఠాగూర్​ స్పందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ (Manikyam Tagore) కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమేనని చెప్పారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్​లో నేతల మధ్య విభేదాలు, శశిధర్​ రెడ్డి వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ రాక తదితర విషయాలపై ఠాగూర్​ స్పందించారు. ఇక ఠాగూర్‌ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని, ఇంకెవరికీ ఏజెంట్‌ను కాదని తెలియజేశారు. ఈ మేరకు ఠాగూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యం. టీపీసీసీ చీఫ్‌ కెప్టెన్‌ మాత్రమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇంటికి పిలిచి మరీ బిర్యానీ పెట్టాడు. బీజేపీలో చేరిన వాళ్లే నాపై ఏదైనా మాట్లాడతారు. తెలంగాణలో పార్టీ పరిస్థితుల్ని సోనియా, రాహుల్‌​, ప్రియాంక తెలుసుకుంటున్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణకి వస్తా అంటే వెల్కమ్‌ చెప్తాను. ఇక్కడ నుంచి పోటీచేయాలని రాహుల్‌, ప్రియాంకను రిక్వెస్ట్‌ చేస్తే వాళ్లు ఆలోచిస్తారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా (Telangana Congress in-charge) ప్రియాంక గాంధీ వస్తే సంతోషమే" అన్నారు.

    ముంపు ప్రాంతాలు, ప్రాజెక్ట్‌ల సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ నేతలను, పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దారుణమని మాణిక్కం ఠాగూర్ అన్నారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళితే తప్పేంటని ప్రశ్నించారు.  ఇక, ఈ రోజు ఉదయం పార్టీ ముఖ్యనేతలతో మాణిక్కం ఠాగూర్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ అంతర్గత అంశాలను చర్చించారు.

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా? 

    మధుయాష్కీ గైర్హజరు కావడంపై..

    మునుగోడులో కాంగ్రెస్ వ్యుహ ప్రచార కన్వీనర్‌గా ఉన్న మధుయాష్కీ సమావేశానికి గైర్హజరు కావడంపై మాణిక్కం ఠాగూరు అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్(Congress) పార్టీ వేసి వ్యూహరచన కమిటీలో ఉన్న మధుయాష్కీ.. ఈ రోజు జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నారు. దీనిపై మాణిక్యం ఠాగూర్(Manikam Tagore) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే కమిటీలో కీలక వ్యక్తిగా ఉంటూ.. ఆయన ఈ రకమైన సమావేశానికి దూరంగా ఉండటాన్ని మాణిక్యం ఠాగూర్ తప్పుబట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మధుయాష్కీ ఇలా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం వెనుక రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్న విభేదాలే కారణమనే వాదన వినిపిస్తోంది.

    ఏపీలోనూ..

    ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని.. నిజామాబాద్ జిల్లాలో తనను విమర్శించే కొందరు నేతలకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారనే భావన మధుయాష్కీకి ఉందని పార్టీలో టాక్ ఉంది. అంతేకాదు మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మధుయాష్కీ ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన భిన్నంగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీసీలకు ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. కాబట్టి అక్కడ బీసీ నాయకులకు టికెట్ ఇవ్వాలని ఆయన వాదిస్తున్నట్టు సమాచారం.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు