టీ కాంగ్రెస్ పాదయాత్రపై ఆ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే (Manik rao thakre) క్లారిటీ ఇచ్చారు. 50 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి, 30 నియోజకవర్గాల్లో సీనియర్లు జోడో యాత్ర చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఎవరికి అనుకూలంగా ఉన్న నియోజకర్గాల్లో వారు పాదయాత్ర చేసుకోవచ్చని ఠాక్రే (Manik rao thakre) నాయకులకు చెప్పినట్టు తెలుస్తుంది. కాగా కాంగ్రెస్ లో నెలకొన్న సమస్యలపై ఠాక్రే (Manik rao thakre) దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు నాయకులతో భేటీ అయిన ఠాక్రే..నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి. పార్టీకి నష్టం చేకూరేలా ఎవరూ మాట్లాడకూడదని అన్నారు. నేను ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని ఠాక్రే చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీలో అందరిని కలుపుకుని పోయే బాధ్యత రేవంత్ రెడ్డి (Revanth reddy)దే అని ఠాక్రే (Manik rao thakre) అన్నారు. పార్టీలో పరాయి పాలన వద్దు. ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఇంకెప్పుడు ఎన్నికలకు వెళ్తాము. సీనియర్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ కోసం కృషి చేయాలి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఠాక్రే (Manik rao thakre) సూచించారు.
ఫిబ్రవరి 6న అక్కడ బహిరంగ సభతో పాదయాత్ర ప్రారంభం?
ఇక ఈ పాదయాత్ర ఫిబ్రవరి 6న భద్రాచలంలో భారీ బహిరంగ సభతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ పాదయాత్ర కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే చేస్తారనే అపోహను ఠాక్రే సీనియర్లకు చెప్పారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొనాలి. అయితే ఎవరికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలో పాల్గొనాలని చెప్పినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ వంటి నాయకులు ఆయా నియోజకవర్గాల్లో పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తుంది.
ఇక రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి పాదయాత్ర చేస్తే బాగుంటుందని కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్, భట్టి కలిసి పని చేస్తే అందరం కలిసి ఉన్న ఇండికేషన్ ఉంటుంది. అలాగే కోమటిరెడ్డిపై మరోసారి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీకి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. తొందరలోనే హైకమాండ్ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నానని కొండా సురేఖ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Mp revanthreddy, Telangana