Home /News /telangana /

TS POLITICS MANICKAM TAGORE MAY PUT END CARD TO KOMATIREDDY VENKAT REDDY DISPUTE IN TELANGANA CONGRESS AK

Telangana Congress: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీకి రేపటితో ముగింపు?.. ఆ నేత రాకతో..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Komatireddy Venkat Reddy: మాణిక్యం ఠాగూర్ స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి చర్చలు జరిపి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడులో విజయం సాధించేందుకు మిగతా పార్టీల కంటే ముందుగానే రంగంలోకిది దిగింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్, బీజేపీలను ఢీ కొట్టి మునుగోడులో విజయం సాధించడం అంత సులువు కాదని కాంగ్రెస్ పార్టీకి తెలియనిది కాదు. అయితే తెలంగాణలో మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారడంతో.. ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆలోచనతో ఉన్న ఆ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్లీ పోటీ చేయబోయేది తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కావడం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం విషయంలో ఆయన చాలాకాలం నుంచి అసంతృప్తిగా ఉండటంతో.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన ఎలాంటి వైఖరి తీసుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

    దీనికితోడు ఇటీవల ఆయనపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహానికి మరింత కారణమైంది. అయితే ఆయనకు రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఎంపీ కోమటిరెడ్డి ఇంకా శాంతించడం లేదు. అయితే రేపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రానికి వస్తుండటంతో.. ఆయన ఈ వ్యవహారంపైనే దృష్టి పెడతారనే చర్చ జరుగుతోంది.



    మాణిక్యం ఠాగూర్ స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి చర్చలు జరిపి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మాణిక్యం ఠాగూర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య కూడా గ్యాప్ ఉండటంతో.. వీరి మధ్య చర్చలు జరుగుతాయా లేదా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన తరువాత కూడా కోమటిరెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో.. ఆయనను పట్టించుకోకుండానే కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికల్లో ముందుకు సాగే విధంగా మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచనలు ఏమైనా చేయబోతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది.

    Munugodu| Congress: ‘మునుగోడు’ మండలాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌లు వీరే.. కీలక బాధ్యతలు

    KCR| Munugodu: కేసీఆర్ ‘మునుగోడు’ నినాదం ఏంటి ?.. ఈసారి హుజూరాబాద్‌కు భిన్నంగా..

    అయితే మునుగోడు ఉప ఎన్నికల అంశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ నేతలకు క్లారిటీ ఇవ్వడంతో పాటు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తును కూడా ముమ్మరం చేసే దిశగా ఠాగూర్ చర్యలు ఉండబోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మాణిక్యం ఠాగూర్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ రేపు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Komatireddy venkat reddy, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు