Home /News /telangana /

TS POLITICS MANDA KRISHNA MADIGA BEGINS MADIGA SANGRAMA YATRA TODAY MRPS LEADER SLAMS BJP ON SC RESERVATION CLASSIFICATION MKS

Telangana : ముందస్తు వేడిలో మరో యాత్ర.. Manda Krishna Madiga సంగ్రామం.. టార్గెట్ ఎవరంటే..

మంద కృష్ణ మాదిగ (ఫైల్ ఫొటో)

మంద కృష్ణ మాదిగ (ఫైల్ ఫొటో)

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడిని పెంచుతూ విపక్ష పార్టీలన్నీ వివిధ పేర్లతో పాదయాత్రలు, యాత్రలు చేస్తుండగా, ఇప్పుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సైతం తనదైన డిమాండ్ తో నేటి నుంచి యాత్రకు సిద్ధమయ్యారు. వివరాలివే..

ఇంకా చదవండి ...
తెలంగాణ (Telangana)లో ముందస్తు ఎన్నికల వేడిని మరింత రాజేస్తూ మరో కీలక నేత యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, రైతు రచ్చబండ పేరుతో కాంగ్రెస్ యాత్రలు, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన యాత్ర, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) సైతం అదే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తో ఎమ్మార్పీఎప్ నేటి(మే 28) నుంచి తెలంగాణ వ్యాప్త యాత్రను తలపెట్టింది. తదుపరి ఈ యాత్ర ఏపీలోనూ కొనసాగనుంది. వివరాలివే..

ముందస్తు ఎన్నికలు ఉండబోవని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినా రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో మాత్రం ముందస్తు వేడి పెరుగుతున్నది. విపక్షాలన్నీ ఏ ఒక పేరుతో యాత్రలు చేస్తుండగా, అధికార టీఆర్ఎస్ సైతం కేంద్రం-బీజేపీపై పోరులో భాగంగా తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటించనుంది. ఈలోపే మంద కృష్ణ మాదిగ సైతం జనంలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు..

Petrol Diesel : పెట్రోల్ లేదు నాయనా.. ఆ ఇద్దరి మధ్య గొడవతో వాహనదారులకు షాక్.. 31న బంద్


ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలోని జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్‌ సంగ్రామయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాత్ర విశేషాలను వివరించారు.

Monkeypox : ఇండియాకు మంకీపాక్స్ వైరస్ ముప్పు? -ఈ 5లక్షణాలతో జాగ్రత్తగా ఉండాలన్న ICMR


మంద కృష్ణ నేతృత్వంలో ఎంఆర్పీఎప్ మాదిగల సంగ్రామ యాత్ర నేడు (మే 28) సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ నుంచి ప్రారంభం కానుంది. ఎస్సీ వర్గీకరణపై గ్రామాల్లో చైతన్యం కల్పించేందుకే ఈ యాత్ర చేపట్టానని మంద కృష్ణ పేర్కొన్నారు. మొత్తం 120 రోజులపాటు 119 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. వర్గీకరణ విషయంలో జాప్యంచేస్తే కేంద్రంపై యుద్ధం మొదలవుతుందని ఆయన హెచ్చరించారు.

Liquor Loot : హైవేపై భయానక కారు ప్రమాదం.. అందులోని మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం..


ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత డిమాండ్ చేస్తూ తెలంగాణలో మొదలైన మాదిగల సంగ్రామ యాత్ర.. జూన్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహిస్తామని మంద కృష్ణ తెలిపారు. కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా పేరును స్వాగతిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణతోపాటు ఏపీలోనూ ఎమ్మార్పీఎస్‌ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో మంద కృష్ణ వెంట ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సురేష్‌, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్‌ తదితరులున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Manda Krishna Madiga, Telangana, Yatra

తదుపరి వార్తలు