తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న వేళ హైడ్రామా నెలకొంది. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి రావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆయన మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు నా కొడుకును ఇబ్బంది పెట్టారు. నా కుమారుడిని CRPF బలగాలు ఛాతీపై కొట్టారు అందుకే ఆసుపత్రిలో చేర్చారని ఆరోపించారు. ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష. మేము స్మగ్లింగ్ చేయట్లేదు. క్యాసినోలు ఆడించడం లేదు. మా దగ్గర దొరికింది ఏమి లేదు. 200 మంది ఐటీ అధికారులు మాపై దౌర్జన్యం చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డితో పాటే ఐటీ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. తన కొడుకును కూడా ఐటీ అధికారులు చూడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బంధువుల ఇళ్లలో డబ్బు దొరికితే నాకేం సంబంధం. టీఆర్ఎస్ మంత్రిననే నాపై కక్ష కట్టారు. మా కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.
ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు..
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి రావడంతో సూరారంలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. కుమారుడిని చూడడానికి మల్లారెడ్డి సహా పలువురు బంధువులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక మహేందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఏ మేరకు వైద్యులతో కూడా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీనితో ఆసుపత్రి వద్ద భారీగా బలగాలు మోహరించాయి.
అమ్మాయిల రెస్ట్ రూంలో రహస్య కెమెరా పెట్టాడు.. కాలేజ్ స్టూడెంట్ అరెస్ట్
ఎంత నగదు పట్టుబడింది?
ఈ రైడ్స్ లో భాగంగా మల్లారెడ్డి బంధువుల ఇంట్లో రూ. 2కోట్లు దొరికినట్లు తెలుస్తుంది. కానీ మొత్తం నగదు ఎంత దొరికిందనేది తెలియాల్సి ఉంది. అలాగే బ్యాంకులకు సంబంధించి లావాదేవీల్లో వ్యత్యాసాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం 300 బ్యాంకు అకౌంట్లకు సంబంధించి లావాదేవాలను పరిశిలీస్తున్నారు.
కాగా నిన్న తెల్లవారుజాము 5 గంటల నుండి మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, విద్యాసంస్థల్లో 50 బృందాలు ఏకకాలంలో రైడ్స్ చేపట్టారు. ఇవాళ కూడా ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు సీజ్ చేశారు. అలాగే లాకర్ ను పగులగొట్టిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ రైడ్స్ నేడు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Malla Reddy, Mallareddy, Telangana, Trs