Home /News /telangana /

TS POLITICS MALKAJGIRI MLA MAINAMPALLI HANUMANTRAO PERSONAL CRITICIZES GHMC BJP WOMEN CORPORATOR SNR

TRS vs BJP : నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు .. లేడీ కార్పొరేటర్‌ని ఎమ్మెల్యే అలా అనొచ్చా

(వ్యక్తిగత విమర్శలు)

(వ్యక్తిగత విమర్శలు)

Hyderabad: అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి..ఓ మహిళా కార్పొరేటర్‌ని తిట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో లేడీ కార్పొరేటర్‌ని వ్యక్తిగతం విమర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

రాజకీయాలు రాను రాను మరీ చౌకబారుతనంగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి నేతలు సైతం గల్లీ లీడర్ల తరహాలోనే వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు జనం. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన నేతలు, అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పబ్లిక్‌లో పలచన అవుతున్నారు. ఎదుటి వ్యక్తి తమ పార్టీ కాకపోతే ఎంత మాటైనా అనవచ్చు అనే స్థాయికి రాజకీయాల్ని దిగజార్చారని హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన చెబుతోంది. మల్కాజ్‌గిరి శాసన సభ్యులు(Malkajgiri MLA)మైనంపల్లి హనుమంతరావు(Mynampalli Hanumantrao) మరోసారి వార్తలకెక్కారు. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను 138వ డివిజన్ కార్పొరేటర్(Division Corporator)గున్నాల సునీతశేఖర్‌ యాదవ్(Gunnala Sunitasekhar Yadav)ప్రారంభించారు. డివిజన్‌లోని గణేష్‌నగర్‌(Ganesh Nagar)రోడ్డు నిర్మాణం పనులకు స్థానిక కార్పొరేటర్‌(Corporator)‌గా ఆమె ప్రారంభిస్తే నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆమెపై దుర్భాషలాడారు(Criticizes). పబ్లిక్‌ ప్లేసులో ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

అంత నోటి దురుసేందుకు..
138డివిజన్‌లో రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్‌గా ససునీతశేఖర్‌ ప్రారంభించిన సమయంలో కొందరు టీఆర్ఎస్‌ నేతలు ఎమ్మెల్యే మంజూరు చేయించిన పనులను బీజేపీ కార్పొరేటర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. దానికి కార్పొరేటర్ కొందరు టీఆర్ఎస్‌ నాయకులు ఎమ్మెల్యేకి తొత్తులుగా మారి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం ఎమ్మెల్యే మైనంపల్లికి తెలియడంతో మహిళా కార్పొరేటర్ అనే విషయాన్ని మర్చిపోయి...నోటికొచ్చినట్లు మాట్లాడారు. మీ క్యారెక్టర్ నాకు తెలుసు..నేను నోరు విప్పితే నిద్ర కూడా పోరంటూ నిప్పులు చెరిగారు. మీరా నన్ను విమర్శించేది..నాపై నోరు పారేసుకుంటే మీ జాతకం బయటపెట్టాల్సి వస్తుందని ధ్వజమెత్తారు మైనంపల్లి.



వ్యక్తిగత విమర్శలు సరికాదు..
రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ , బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లుగా మారింది సిస్ట్యూవేషన్. అయితే పార్టీ అభిప్రాయాలు పక్కన పెడితే హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. కాని ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్‌ను అది కూడా మహిళా నాయకురాలిని నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అని విమర్శించడంపై ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు ప్రజలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఇది చదవండి : ఇకపై మెట్రో స్టేష‌న్స్‌లో మీరు షాపింగ్ చేయొచ్చు.. మెట్రో రైల్ బంప‌ర్ ఆఫ‌ర్..?          



గతంలో కూడా ఇదే మాదిరిగా..
మైనంపల్లి హనుమంతరావు..ఈవిధంగా నోరు పారేసుకోవడం కొత్తేమి కాదు. గతంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కూడా నీ రాసలీలలు బయటపెడతానంటూ..నా నియోజకవర్గంలోకి అడుగుపెడితే నీ గుండు పగులుద్ది అని నోటికొచ్చినట్లుగా మాట్లాడటంతో అప్పుడు బీజేపీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఇంటి ముందు ధర్నా కూడా చేపట్టారు. ఒకనొక సందర్భంలో ఆయన ఇంటిని ముట్టడించడం..రోడ్డుపై కనిపిస్తే అడ్డుకుంటామనే స్థాయిలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు మహిళా కార్పొరేటర్‌ను సైతం వ్యక్తిగతంగా విమర్శించడంపై కూడా రాజకీయంగా దుమారం చెలరేగుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Greater hyderabad, Hanumantha rao, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు