హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics: తెలంగాణ అధికార పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు .. పదవులు పోయె గుర్తింపు కరువాయె

Telangana politics: తెలంగాణ అధికార పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు .. పదవులు పోయె గుర్తింపు కరువాయె

(FILE PHOTO)

(FILE PHOTO)

Telangana politics: వాళ్లంతా ఒకప్పుడు సైకిల్ గుర్తు పార్టీలో కీలక పదవులు చేపట్టిన నాయకులు. రాష్ట్రం వేరవడం, టీడీపీ పతనం కావడంతో కారెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పార్టీ అధ్యక్షుడు కూడా మనవాడేగా అనుకున్నారు. సీన్‌ కట్ చేస్తే .. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాదు కదా పార్టీలోనే కనీసం గుర్తింపు కూడా నోచుకోలేని పరిస్ధితిలో ఉన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓడలు బళ్లు అవుతాయి..బళ్లు ఓడలవుతాయి అనే సామెత ఇప్పుడు తెలంగాణలోని అధికార పార్టీలోని టీడీపీలో మంత్రులుగా చెలామణి అయిన కొందరికి సరిగ్గా సూటవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చలామణి అయిన వాళ్లలో చాలామంది ప్రస్తుతం టీఆర్ఎస్‌(TRS)లో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడం, టీడీపీ బలహీనపడటంతో క్రమంగా టీడీపీ నేతలు చాలా మంది అధికార టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. తర్వాత పార్టీని విలీనం కూడా చేశారు. ఇంతక వరకు బాగానే ఉంది. కాని టీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌(KCR)కి మంత్రి పదవి దక్కని టైమ్‌లో మంత్రులుగా చలామణి అయిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్‌లో చెల్లని నోట్లుగా మారిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు వాళ్లెవరూ..? ఎందుకలా జరుగుతుంది అనే విషయంలో అనేక కారణాలు ఉదాహరణగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Munugodu Bypoll: మునుగోడులో బీజేపీ దూకుడు.. మరో బహిరంగ సభ.. ఈసారి భారీగా చేరికలు..!



ఆ ఐదుగురి పరిస్థితి అంతేనా ..
తెలంగాణలో పూర్తిగా భూస్థాపితమైన టీడీపీలో సుమారు మూడు దశాబ్ధాలకుపైగా పని చేసి..మంత్రి పదవులు అనుభవించారు కొందరు నేతలు. అందులో ముఖ్యులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, కాకులమర్రి విజయరావు ఈ ఐదుగురితో పాటు మరో నలుగురు ఐదుగురు అగ్రస్థాయి టీడీపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీకి ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్‌ కావడం, ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌ ప్రజల్లో ముద్రవేసుకోవడంతో కేసీఆర్‌ పిలుపు మేరకు సైకిల్‌ దిగి కారెక్కారు. టీఆర్ఎస్‌ పార్టీలో చేరిన ఈ సీనియర్‌ టీడీపీ నేతలు, మాజీ మంత్రులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదనేది తెలంగాణ టీడీపీ అభిమానుల వాదన. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ సైతం ఒకప్పటి టీడీపీ నేత కావడంతో తమకు సముచిత స్థానం లభిస్తుందని టీడీపీలో బుగ్గ కారులో తిరిగిన వాళ్లంతా భావించారు. అయితే అది కొందరి విషయంలో మాత్రమే నెరవేరింది. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి వంటి నాయకులకు కేసీఆర్ గౌరవప్రదమైన స్థానం కల్పించినప్పటికి ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలతో వారి మంత్రి పదవులకు ఎసరు తెచ్చి పెట్టాయి. ఇక చాలా రోజులు టీడీపీకి దూరంగా టీఆర్ఎస్‌లో కలవకుండా తటస్థంగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరావు,కాకులమర్రి విజయరామారావు వంటి కీలక నేతల్ని కేసీఆరే స్వయంగా టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు.


అధికార పార్టీలో దొరకని గుర్తింపు ..
ఈవిధంగా టీఆర్ఎస్‌లోకి చేరిన నాయకులకు మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలనే గుర్తింపు కాదు కదా కనీసం టీఆర్ఎస్‌లో క్రియాశీల నేతలే పేరు కూడా దక్కకపోవడం శోచనీయం. ఏదో కారణాలు, రాజకీయ అవసరాల కోసమే టీడీపీ సీనియర్‌లుగా ఉన్న ఈ ఐదుగుర్ని గులాబీ బాస్‌ అక్కున చేర్చుకొని తర్వాత పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా వినిపించాయి. మొదటి సారి విజయం తర్వాత కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం హోదా, తుమ్మలకు క్యాబినెట్ హోదా కల్పించినప్పటికి తర్వాత ఎన్నికల్లో వాళ్లిద్దరూ ఓడిపోవడంతో వాళ్లను కేసీఆర్ పక్కనపెట్టారనే టాక్ ఉంది. అంతే కాదు ఈ సీనియర్‌లతో కేసీఆర్‌ టీడీపీలో కలిసి పని చేసిన సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సమయంలో వీళ్లంతా మంత్రులుగా చెలామణి అయిన వాళ్లే కావడం విశేషం. అందుకే తన క్యాబినెట్‌లో ఒక్క ఛాన్స్ ఇచ్చి ఓటమి పేరుతో వదిలించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

Munugodu: నేటి నుంచి మునుగోడు ప్రచారంలోకి కాంగ్రెస్​.. ఆ పార్టీ నినాదం ఇదే..



పదవులు లేవు పరపతి లేదు..
టీడీపీలో సీనియర్‌గా ఉన్న కడియం, తుమ్మల,మోత్కుపల్లి, మండవ, కాకులమర్రి వంటి ఐదుగురితో పాటు ఎర్రబెల్లి దయాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ సైతం తర్వాత వరుసలో టీఆర్ఎస్‌ పంచన చేరిన వాళ్లే. తలసాని మినహా మిగిలిన వాళ్లకు టీడీపీలో మంత్రి పదవులు లభించకపోవడంతో ..కేసీఆర్‌ తన సెకండ్‌ టర్మ్‌లో వారికి మంత్రి పదవులు ఇచ్చి సీనియర్లకు మొండి చేయి చూపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరిని, నిజామాబాద్ జిల్లాలో మండవను పదవులు ఇవ్వకుండా ఒంటరి వాళ్లను చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తిరుగులేని ఆధిక్యం కనబర్చింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుండటంతో ..ఇప్పడైనా వారికి ప్రాధాన్యత కల్పిస్తారా లేక పూర్తిగా విస్మరిస్తారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా జరుగుతోంది.

First published:

Tags: Telangana Politics, TRS leaders