తెలంగాణ(Telangana)లో అగ్నిపథ్ Agnipath కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో రాజుకున్న చిచ్చు అంతకంతకు ఎగసిపడుతోంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ఒక పార్టీపై మరో పార్టీ నిందలు వేసుకుంటూ నిరసనలు, ధర్నాలకు దిగుతున్నాయి. అయితే ఈ విధ్వంసానికి పూర్తిగా కారణం బీజేపీ ప్రభుత్వమే అని టీఆర్‌ఎస్ (TRS)నేతలు ఆరోపిస్తుంటే కమలం పార్టీ మాత్రం ఆందోళనలో పాల్గొన్న వాళ్లను కాంగ్రెస్సే(Congress) పంపిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈవిషయంలో నిజంగా బీజేపీ తీరు ఎంటో బయటపెడతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy). బీజేపీ అగ్నిపథ్ ఉద్యోగ నియామకాల విషయంలో అగ్గి రాజేసి జరిగిన విధ్వంసాన్ని కాంగ్రెస్‌పై నెట్టాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. శవ రాజకీయాలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishanreddy)ని ఈవిషయంలో వదిలిపెట్టబోమని హెచ్చరించారు తెలంగాణ హస్తం నేతలు.
కాంగ్రెస్ సత్యాగ్రహదీక్ష..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కాల్పుల ఘటనలో గాయపడిన యువకులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో సత్యగ్రహదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగానే రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం, ఆందోళనల వెనుక కాంగ్రెస్ ఉంది..మూడు వేల మందిని కాంగ్రెస్ పార్టీ నేతలే పంపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగ నియామక విషయంలో ప్రకటన చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం..రైల్వే స్టేషన్‌లో యువకులపై కాల్పులు జరిపింది రైల్వేపోలీసులు అలాంటిది కాంగ్రెస్ నేతలపై గొడవను నెట్టడం చూస్తుంటే బండి సంజయ్‌కి బుద్ది ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నిజంగా మీరు చెప్పేది నిజమే అయితే బండి సంజయ్ మీడియా ముందు కాదు...సికింద్రాబాద్ వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. అంతే కాదు బీజేపీ నేతలైన బండి సంజయ్, కిషన్‌రెడ్డికి ధైర్యం ఉంటే కాల్పుల్లో చనిపోయిన రాకేష్ ఇంటికి వచ్చి మాట్లాడాలన్నారు.
బీజేపీ నేతల్ని నిలదీస్తాం..
రాష్ట్రంలో, కేంద్రంలో శవరాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలను అగ్నిపథ్ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ నూతన నియామక ఆదేశాలను వెనక్కి తీసుకునే వరకు బీజేపీ నేతలు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకుంటామని ...ఇదే విషయంపై నిలదీస్తామన్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొన్న మూడు వేలమందిని కలుపుకొని గెరావ్ చేస్తామని హెచ్చరించారు. నిజంగా బీజేపీ నేతలకు దమ్ముంటే చనిపోయిన రాకేష్ ఇంటికి రావాలని సవాల్ విసిరారు. రాకేష్ మృతదేహంపై టీఆర్‌ఎస్ జెండా ఎందుకు కప్పారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. అగ్నిపథ్ అల్లర్లకు రాకేష్ మృతికి బీజేపీ కారణమైతే...టీఆర్‌ఎస్ శవరాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని జగ్గారెడ్డి, వీహెచ్ వంటి కాంగ్రెస్ నేతలు కమలం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
వదిలే ప్రసక్తే లేదు..
అగ్నిపథ్ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలంగాణ హస్తం నేతలు స్పష్టం చేశారు. ఒకటి రెండ్రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఈ విషయంలో వదిలే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పారు హస్తం గుర్తు పార్టీ నేతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.