హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్ కోసం పోటా పోటీ .. నియోజకవర్గానికి ఎంత మందో తెలుసా..?

Telangana politics : కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్ కోసం పోటా పోటీ .. నియోజకవర్గానికి ఎంత మందో తెలుసా..?

Competition in Congress

Competition in Congress

Telangana : నిన్న మొన్నటి వరకు నిశబ్ధం ఆవహించినట్టుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఊపొచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలం పుంజు కుంటుందన్న ప్రచారంతో రాబోయే ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ల సంఖ్య ఎంతో తెలుసా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కాంగ్రెస్(Congress)పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువైపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచి తమ భవితవ్యం తేల్చుకోవాలని పావులు కదుపు తున్నారు. జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ నాయకులు తమ పలుకుబడిని ఉపయోస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నిశబ్ధం ఆవహించినట్టుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్(Karimnagar)జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఊపొచ్చింది. ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజు కుంటుందన్న ప్రచారం తెరపైకి రాగానే నాయకులు అంతా కూడా తమ భవిష్యత్తును పరీ క్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోతున్నారు.

  Puvvada Ajay | RS ​​Praveen Kumar: ఓట్ల స్కాంలో తెలంగాణ మంత్రి పేరు .. ఈసీకి దమ్ముంటే అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్న RSప్రవీణ్‌కుమార్

  కాంగ్రెస్‌లో కర్ఫీఫ్ వేస్తున్న నేతలు..

  కరీంనగర్‌లో రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగోతంది. కొత్త ముఖాలు కొన్ని వెలుగులోకి వస్తుంటే , వారసులుగా మరికొందరు , తామే సీనియర్లమంటూ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నస్థానాలు ... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరు స్థానాల నుంచి ఆశావాహుల సంఖ్య తీవ్రంగా ఉంది. కరీంనగర్ నుంచి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వైద్యులు అంజన్ కుమార్ , మెన్నేని రోహిత్ రావు , జువ్వాడి నిఖిల్ చక్రవర్తిలు టికెట్ ఆశిస్తున్నారు . సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచగా , ఎన్ఎస్ యూఐ నుంచి పార్టీలోనే కొనసాగుతున్నానని , బీసీ కోటాలో తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తు న్నారు.

  వారసులు ఓవైపు..కొత్తవాళ్లు మరోవైపు..

  మాజీ మంత్రి , ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు కూడా తన తాత వారసుడిగా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుండగా , జువ్వాడి చొక్కారావు మనవడు నిఖిల్ చక్రవర్తి కూడా టికెట్ రేసులో ఉన్నారు. చొక్కారావు మనవడిగానే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తాను దశాబ్ద కాలానికి పైగా పార్టీకి సేవలందిస్తున్నానని చెప్తున్నారు. రామగుండం నుంచి ఠాకూర్ మక్కాన్ సింగ్ , ఐఎన్ టీయూసీ జనక్ ప్రసాద్ , సీడబ్ల్యుసీ సభ్యుడు హర్కాల వేణుగోపాల్ లు పోటీ పడుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న తాను గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యానని, అప్పటి నుంచి నియోజక వర్గంలోనే ఎక్కువగా ఉంటున్నానని తనకే టికెట్ ఇవ్వాలని మక్కాన్ సింగ్ అడుగుతున్నారు. అయితే కార్మిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని , పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో తనకు టికెట్ ఇవ్వాలని జనక్ ప్రసాద్ , ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్న హర్కాల వేణుగోపాల్ తనకు ఇస్తే బావుంటుందని అభిప్రా యపడుతున్నారు.

  ఎవరి ప్రయత్నాలు వాళ్లవే..

  పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు , ఓదెల జెడ్పీటీసీ గంట రాములు , సీనియర్ కాంగ్రెస్ నేత ఈర్ల కొమురయ్య , సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన అంతటి అన్నయ్యలు టికెట్ ఆశిస్తున్నారు . సిరిసిల్ల అసెంబ్లీ నుంచి కేకే మహేందర్ రెడ్డి , చీటి ఉమేష్ రావు , సంగీతం శ్రీనివాస్ లు టికెట్ ఆశిస్తున్నారు . కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు , కొమిరెడ్డి రాములు , సుజిత్ రావులు టికెట్ ఆశిస్తున్నారు . చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం , నాగి శేఖర్, మానకొండూర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్, హుజురాబాద్ బాలమూరి వెంకట్, మాజీ మంత్రి ముద్దసాని బంధువులు ఆశలు పెట్టుకున్నారు.

  Hyderabad: ట్యాంక్ బండ్ శివకి మరో శుభవార్త.. త్వరలోనే ఆయన ఇంటికి మంత్రి కేటీఆర్

  ప్రతి నియోజకవర్గంలో సేమ్ సీన్..

  జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈవిధంగా నియోజకవర్గానికి కనీసం ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్న వర్గాలు వారి బలాలపైనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఈ సారి కూడా ఇదే పరిస్థితి ఉన్న ప్పటికీ ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపే నాయకులు తమ వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నించనున్నారు. అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేయడంలో కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి .మంథని. జగిత్యాల జిల్లా తప్ప 11నియోజకవర్గలలో నాలుగు నుండి ఐదుగురు మంది పోటీ పడుతన్నట్లు సమాచారం.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana Politics, TS Congress

  ఉత్తమ కథలు