తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఈనెల 3న జరిగిన మునుగోడు(Munugodu)ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్దిగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla prabhakar reddy)గురువారం అసెంబ్లీలోని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy)ఛాంబర్‌లో ఉదయం 11గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR)తో పాటు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి,వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అసెంబ్లీలో పెరిగిన బలం..
టీఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఛాంబర్‌లో ఈకార్యక్రమం జరిగింది. మంత్రులు కేటీఆర్ , హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యే సమక్షంలో ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. pic.twitter.com/bmNuMbBpRr
— K Prabhakar Reddy (@Koosukuntla_TRS) November 10, 2022
ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం..
టీఆర్ఎస్ సిద్దాంతాల్ని నమ్మిన వ్యక్తిగా, సీఎం పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి పార్టీలో చేరారు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. ఉద్యమకారుడిగా, స్థానికంగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మునుగోడులో మూడు సార్లు పోటీ చేస్తే 2008లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు ప్రభాకర్‌రెడ్డి. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈపరిస్థితుల్లోనే మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. 11వేల 666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రభాకర్‌రెడ్డి.
బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఫస్ట్ విక్టరీ..
టీఆర్ఎస్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత గులాబీ పార్టీ మునుగోడులో పొందిన తొలి విజయం కావడంతో పార్టీకి కొత్త ఊపు నిచ్చినట్లైంది. ఈ జోష్‌తోనే ముందుకు వెళ్తామని ..బీజేపీని పత్తా లేకుండా చేస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం మునుగోడు ఫలితాలతో టీఆర్ఎస్‌లో భయం మొదలైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana Politics, TRS leaders