మునుగోడు( Munugode)ఉపఎన్నికల్లో టీఆర్ఆర్ (TRS)అభ్యర్దిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ది కోరుకుంటూ ఆత్మగౌరవానికి పట్టం కట్టిన మునుగోడు ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో బీజేపీ(BJP) వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. అయినా ప్రజలు బీజేపీ నేతల మాటలకు, వాళ్ల ప్రలోభాలకు తలవంచకుండా టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించి ఢిల్లీ (Delhi)పెద్దలకు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారని చెప్పారు. ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం 40రోజులుగా పని చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తున్న ఎన్నికల సంఘంపై కూడా విమర్శలు చేసిన బీజేపీ నేతలు తమ స్థాయిని దిగజార్చుకున్నారని కమలం నేతల తీరును ఎండగట్టారు.
ప్రజల తీర్పు గొప్పది..
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. దానికి కారణం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే. మొత్తం 12నియోజకవర్గాలకు గాను 12స్థానాల్లో టీఆర్ఎస్ కైవసం చేసుుకుంది. ముఖ్యంగా 2018సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. తాజాగా మునుగోడులో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి బీజేపీ అభ్యర్ధిపై 11వేల 666ఓట్ల మెజార్టీతో గెలవడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా అహంకారానికి చెంప పెట్టులాంటి తీర్పునిచ్చారని మునుగోడు ప్రజల చైతన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
Live: TRS Working President, Minister Sri @KTRTRS addressing the Media at Telangana Bhavan#MunugodeWithTRS https://t.co/t0v8gcDi4f
— TRS Party (@trspartyonline) November 6, 2022
అహంకారంపై దెబ్బ కొట్టారు..
కేవలం డబ్బు, అహంకారంతో కళ్లు నెత్తికెక్కి ఉపఎన్నిక కోరుకున్న వాళ్లకు నియోజకవర్గ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయని పెద్దలు ఎప్పుడో చెప్పిన నానుడిని ఇప్పుడు నిజమైందన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఢిల్లీ పెద్దల అహంకారానికి చెంపపెట్టులాంటిదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడంతో పాటు తెలంగాణలోనూ క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది బీజేపీ పార్టీ. దీని వెనక ఉందని అమిత్ షా, నరేంద్ర మోదీ అని తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి తగిన గుణపాఠం చెప్పారని అభినందించారు.
బీజేపీ ఎత్తులు చిత్తు చేశారు..
తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు బీజేపీ వేసిన ఎత్తులు, పెట్టిన ప్రలోభాలను ప్రజలు తిప్పుకొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటీ రెండు కాదు.. అధికార దుర్వినియోగం, విచ్చలవిడి తనానికి పరాటకష్టగా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించిందన్నారు. 15 కంపెనీల సీఆర్పీఎఫ్ పోలీసులను దించారు.45 ఐటీ టీమ్లను దించి ఏడు మండలాల్లో గ్రామీణ నియోజకవర్గ మీద దండయాత్ర వచ్చినట్టే వచ్చారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచారు.. మేమం పట్టుకుంటామని 40 టీమ్లు వచ్చింది వాస్తవం కాదా? ఇంత పెద్ద ఎత్తున వందకోట్లు ఎలక్షన్ కమిషన్కు షికాయత్ చేస్తే ప్రేక్షకపాత్ర వహించింది నిజం కాదా.. ఇలా ఎన్ని చేసిన చివరకు టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయారు. కొంత మెజారిటీని ప్రలోభ పెట్టి తగ్గించగలిగారు’ అని కేటీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister ktr, Telangana Politics